రేప్ ఆరోపణల నుంచి యాంకర్ ప్రదీప్‌కు విముక్తి.. బాధితురాలు యూటర్న్‌తో ఊరట
లైంగిక వేధింపులు, రేప్ ఆరోపణల వ్యవహారంలో యాంకర్ ప్రదీప్, నటుడు, నిర్మాత కృష్ణుడికి ఉపశమనం లభించింది. ఓ యువతి తనపై 139 మంది రేప్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు చేయడంతో గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ప్రకంపలను మొదలయ్యాయి. యాంకర్లు, సినీ నటులు, సెలబ్రిటీల పేర్లు బయటపెడుతానని ఆమె హెచ్చరించడంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ప్రదీప్, కృష్టుడు మీడియాలో స్పందించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆరోపణలు చేసిన యువతి యూటర్న్ తీసుకోవడంతో ఈ కేసు వ్యవహరం ఊహించిన టర్న్ తీసుకొన్నది. ఈ వివాదంలోకి వెళ్లితే..

లైంగిక దాడి ఆరోపణలపై ప్రదీప్
తనపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో యాంకర్ ప్రదీప్ మీడియాలో నేరుగా స్పందించారు. తనకు, ఆ యువతికి ఎలాంటి పరిచయం లేదు. కావాలనే నన్ను ఇరికిస్తున్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాను. వారికి శిక్ష పడేంత వరకు ఉపేక్షించేది లేదని ప్రదీప్ స్పందించారు.

వాస్తవాలు తెలుసుకొని రాయాలంటూ..
యువతి చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకోకుండా మీడియా నాపై రకరకాలుగా వార్తలు ప్రచురించింది. సోషల్ మీడియాలో కూడా నాపై అనుచితంగా కామెంట్లు చేయడం బాధాకరం. ఇలాంటి అవాస్తవాలతో నా కుటుంబం కూడా మనోవేదనకు గురైంది. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయలని యాంకర్ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కృష్ణుడు కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై వాస్తవాలు రాయాలని వేడుకొన్నారు.

డాలర్ బాబు తనని చంపేస్తానని బెదిరిస్తే
యువతిపై 139 మంది రేప్ కేసు వ్యవహారం మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ సంచలనంగా మారుతున్న సమయంలో బాధితురాలు యూటర్న్ తీసుకొన్నది. తనని 139 మంది రేప్ చేయలేదు. నా కుటుంబాన్ని చంపేస్తానని డాలర్ బాయ్ అలియాస్ శ్రీకర్ రెడ్డి బెదిరించాడు. ఉద్యోగం పేరుతో ఆయన నన్ను మోసం చేశాడు. అతడి బలవంతం చేయడం, సూచనతోనే ఆ విధంగా చెప్పాను అని బాధితురాలు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారు.
Recommended Video

ప్రదీప్, కృష్ణుడికి సంబంధం లేదని
డాలర్ బాయ్ అలియాస్ శ్రీకర్ రెడ్డి ఒత్తిడి మేరకే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పాను. ఈ కేసుతో ప్రదీప్, కృష్ణుడికి సంబంధం లేదు. నా వల్ల కొంత మంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడ్డారు. వారికి నేను మీడియా ముఖంగా క్షమాపణల చెబుతున్నాను. తనపై లైంగిక దాడి జరిగిన విషయం వాస్తవమే కానీ, సెలబ్రిటీలకు ఎలాంటి సంబంధం లేదు అంటూ బాధితురాలు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











