బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం: యంగ్ సింగర్‌తో అలా.. అందరి ముందే ప్రామిస్ చేయడంతో!

అద్భుతమైన టైమింగ్.. ఆకట్టుకునే శైలితో యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ బుల్లితెరపై తన హవాను చూపిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. గ్లామర్ బ్యూటీల నుంచి పోటీ నెలకొని ఉన్న పరిస్థితుల్లోనూ అదరగొడుతూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సత్తా చాటుతున్నాడు. టెలివిజన్ రంగంలో సత్తా చాటిన అతడు.. హీరోగానూ పరిచయం అవబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిజస్వరూపం బయట పడింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

నంది అవార్డుతో ప్రస్థానాన్ని మొదలెట్టాడు

నంది అవార్డుతో ప్రస్థానాన్ని మొదలెట్టాడు

రేడీయో జాకీగా పని చేస్తున్న సమయంలో జీ తెలుగు ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశాన్ని అందుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆరంభంలో పలు షోలు చేసిన అతడు.. 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే గేమ్‌ షోతో మంచి గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో బెస్ట్ యాంకర్‌గా పలుమార్లు నంది అవార్డును కూడా అందుకున్నాడు.

ఎక్కడ చూసినా అతడే.. ఆ షోలో మరింత

ఎక్కడ చూసినా అతడే.. ఆ షోలో మరింత

జీ తెలుగు ద్వారా పరిచయమైన ప్రదీప్.. ఆ తర్వాత చాలా ఛానెళ్లలో పని చేశాడు. ఇందులో భాగంగానే ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. అతడి కెరీర్‌లో 'ఢీ' ప్రత్యేకమనే చెప్పాలి. ఈ షో ద్వారా అతడిలోని కామిక్ యాంగిల్ కూడా బయట పడింది. దీంతో మరింత హైలైట్ అయ్యాడు. స్పెషల్ ఈవెంట్లలోనూ అదరగొడుతూ ముందుకెళ్తున్నాడు.

కెరీర్‌లో అదే చెత్త షో... గ్రాఫ్ మాత్రం పైపైకి

కెరీర్‌లో అదే చెత్త షో... గ్రాఫ్ మాత్రం పైపైకి

యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో ప్రదీప్ 'పెళ్లి చూపులు' అనే షో చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రసారం అయిన ఈ షో... అంతగా ప్రేక్షకాదరణను పొందలేదు. పైగా విమర్శలను ఎదుర్కొంది. ఈ షో వల్ల ప్రదీప్ కెరీర్‌కు సైతం దెబ్బ పడుతుందన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడి గ్రాఫ్ మారలేదు. అంతేకాదు, వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు.

కొద్ది రోజుల్లో వస్తున్నాడు.. అంతా అతడిదే

కొద్ది రోజుల్లో వస్తున్నాడు.. అంతా అతడిదే

బుల్లితెరపై సత్తా చాటిన ప్రదీప్... ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురూగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' పాట హిట్ అయింది. ఇది జనవరి 29న విడుదల కాబోతుంది.

బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం

బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం

యాంకర్‌గా, యాక్టర్‌గా అదరగొడుతోన్న ప్రదీప్.. హీరోగానూ పరిచయం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనలోని మానవీయ కోణాన్ని కూడా పలుమార్లు బయట పెట్టాడు. ఇప్పటికే ఎంతో మందికి సహాయాన్ని చేశాడు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది పేదలకు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ సింగర్‌కు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాడు.

సింగర్‌తో అలాగ... అందరి ముందే ప్రామిస్

సింగర్‌తో అలాగ... అందరి ముందే ప్రామిస్

ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగులో 'సరిగమప షో' చేస్తున్నాడు. ఇందులో బెస్ట్ సింగర్లలో ఒకడిగా నిలిచిన పవన్ కల్యాణ్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోదు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రదీప్.. అతడి చదువుకు కావాల్సిన ఖర్చును స్వయంగా భరిస్తానని స్టేజ్ మీద నుంచి ప్రామిస్ చేశాడు. దీంతో జడ్జ్‌లు, మెంటర్లతో పాటు మిగిలిన వారంతా నిలబడి చప్పట్లు కొట్టి అతడిని అభినందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X