ఆమె ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్.. వాట్సాప్ గ్రూప్‌లో ఆ నలుగురు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్
యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. సెలెబ్రిటిలతో ముచ్చట్లు చెప్పిస్తూ.. తన మాటల గారిడీతో ఇట్టే ఆకట్టుకుంటాడు. ఇక హోస్టింగ్‌గా ప్రదీప్ చేసే అల్లరి, వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢీ షోలో ప్రదీప్ వేసే కౌంటర్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. తాజాగా ప్రదీప్ హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సందర్భంగా అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో పాల్గొని అనేక విషయాలను వెల్లడించాడు.

ఇంట్లో లైబ్రరీ..
ప్రదీప్ ఇంట్లో లైబ్రరి ఉందని, అందులో ముపై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే పుస్తకం ఉందని అలీ కౌంటర్ వేయగా..అదొక్కటే లేదు.. ఎక్కడ దొరుకుతుందో అని చాలా చోట్ల వెతికానని ప్రదీప్ రివర్స్ కౌంటర్ వేశాడు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలాగో చెప్పమంటూ అలీనే తిరిగి ప్రశ్నించాడు.

ఆమె మొదటి గర్ల్ ఫ్రెండ్..
ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని ప్రశ్నిస్తే.. సోనాలీ బింద్రే అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే తనకు కూడా ఇష్టమేనని, రియల్‌గా ఎవరో చెప్పమని తిరిగి ప్రశ్నిస్తాడు అలీ. ఎందుకు లేండీ సర్ పెళ్లై ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఈ షో చూస్తుంటుందేమోనని అన్నాడు.

వాట్సాప్ గ్రూప్‌లో ఆ నలుగురు..
సుధీర్, రష్మీ, ప్రియమణి, ప్రదీప్ నలుగురికి కలిపి వాట్సాప్ గ్రూప్ ఉందంటా కదా అని అడిగితే.. అవునని చెప్పాడు. దాని పేరే వెరైటీగా ఉంటుందని, రెండు మూడు రోజులు ఆ పేరు గురించే చర్చించుకున్నామని, ఏదో పెద్ద నామకారణం చేసినట్టు బాగుందని అన్నట్లు చెప్పుకొచ్చాడు.

కూరగాయల బండిలో..
చిన్నప్పుడు కూరగాయల బండి కథెంటి? అని అలీ అడిగాడు. చల్లగా ఉందని కూర్చున్నానను, ఆ సమయంలో చెడ్డీ అయినా ఉందా? అని ప్రశ్నిస్తే.. మరీ అంతగా చల్లగా లేదు కాబట్టి చెడ్డీ ఉండే ఉంటుందని నవ్వుల పూయించాడు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











