పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ ప్రదీప్.. హీరోగా మరో సినిమా కూడా అంటూ క్లారిటీ..

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్ లలో ప్రదీప్ ఒకరు. ఎంతో కష్టపడి నెంబర్ వన్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ప్రదీప్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అతను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఈ సీనియర్ యాంకర్ అలాగే తన తదుపరి సినిమాపై కూడా ఒక వివరణ అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ గా క్రేజ్

నెంబర్ వన్ గా క్రేజ్

ఫిమేల్ యాంకర్స్ లలో యాంకర్ సుమ ఏ తరహాలో క్రేజ్ అందుకుంటున్నారో అదే తరహాలో మేల్ యాంకర్స్ లలో ప్రదీప్ కూడా ఆ రేంజ్ లో గుర్తింపు అందుకుంటున్నారు. పారితోషికంలో కూడా అతనే నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఎప్పటికప్పుడు తన క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్న ఈ యాంకర్ మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.

హీరోగా మొదటి విజయం

హీరోగా మొదటి విజయం

ఇక ఆమధ్య '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో యాంకర్ ప్రదీప్ హీరోగా ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రదీప్ ప్రస్తుతం కొన్ని షోలను అయితే యాంకర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని సినిమాలు కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు.

 ఇష్టమైన అమ్మాయితో పెళ్లి అని..

ఇష్టమైన అమ్మాయితో పెళ్లి అని..

అయితే యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు రావడం కొత్తేమీ కాదు. 2018 లోనే అతను స్వయంవరం అనే ఒక షో చేసి అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. అప్పుడే తనకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి అవుతుంది అని కూడా టాక్ వచ్చింది. కానీ అది కేవలం ఒక రియాలిటీ షో గానే ముగిసిపోయింది. దీంతో అప్పుడు ప్రదీప్ పై ఊహించని విధంగా కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

సీక్రెట్ గా నిశ్చితార్థం

సీక్రెట్ గా నిశ్చితార్థం

అయితే రీసెంట్ గా ఒక టెలివిజన్ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లి కాబోతోంది అని కూడా ఒక టాక్ అయితే వినిపించింది. నవ్య అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ తో గత కొంతకాలంగా ప్రదీప్ ప్రేమలో ఉన్నాడు అని వీరికి సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా జరిగింది అని కథనాలు వెలువడ్డాయి. త్వరలోనే ప్రదీప్ అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నాడు అని టాక్ కూడా వచ్చింది.

ఆమెతో పరిచయమే లేదు

ఆమెతో పరిచయమే లేదు

అయితే మొత్తానికి ఇటీవల యాంకర్ ప్రదీప్ తన పెళ్లి పై వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో ఎలాంటి నిజం లేదు అని అసలు ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు అని ఇప్పటివరకు తనను కలవలేదు అని సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు అంటూ త్వరలోనే తన తదుపరి సినిమా పై ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. తప్పకుండా 2023లో అయితే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రదీప్ తెలియజేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X