పోరాటంలోకి దిగుతున్నాను.. నిజాన్ని బయటకు రానివ్వండి.. ఆ వార్తలపై ప్రదీప్ ఫైర్
ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ వార్తల్లో నిలిచాడు. గత రెండు మూడు రోజులుగా ప్రదీప్‌పై ఘోరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడినట్టు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితాలో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటంతీ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎమోషనల్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలను రాసిన వారిని ఎవ్వరినీ వదిలి పెట్టనని వీడియోను రిలీజ్ చేశాడు.

వారి కోసమే ఈ వీడియో..
తప్పుడు వార్తలు రాసే వారిని ఉద్దేశిస్తూ ప్రదీప్ మాట్లాడుతూ..‘మీకెలా కుటుంబం ఉంటుందో నాకు కూడా ఉంటుంది కదా. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం..నన్ను నమ్మనవాళ్లు, నాతో ఉన్నవాళ్లు, నాకు సపోర్ట్ చేసినవాళ్లు.. పదేళ్లుగా నేను టెలివిజన్‌లోఏదైతే షోలు చేస్తున్నానో.. నన్ను చూసే ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని నా ఫ్యామిలీలా ఫీల్ అవుతా.. నా ఇంట్లోవాళ్ల కంటే నన్ను వాళ్లే ఎక్కువగా సపోర్ట్ చేశారు. వారంతా ఇది నిజమా? అని బాధపడుతున్నారు.. వారి బాదను చూసి వాళ్ల కోసం ఈ వీడియో చేస్తున్నాను' అని తెలిపాడు.

లీగల్ యాక్షన్..
సదరు వ్యక్తి చేస్తున్న ఆరోపణలు..పేర్లు వ్యక్తులు, స్థలాలు ఎలాంటి వాటికి నాకు సంబంధం లేదు..అందులో ఏ మాత్రం నిజం లేదు..యాంకర్ ప్రదీప్‌కి ఎలాంటి సంబంధం లేదు..ఇదే నేను చెప్పదలుచుకున్నాను..నిజం బయటకు వచ్చే లోపల.. ఎవరైతే వారికి వారు నిర్దారణ చేసుకుని వార్తలు వ్యాప్తి చేస్తున్నారో వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతోన్నా..దాని తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాదు అని ప్రదీప్ పేర్కొన్నాడు.

ఈ పోరాటంలోకి దిగుతున్నాను..
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సోషల్ ట్రోలింగ్ చేయకండి..దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు...దయచేసి అర్థం చేసుకోండి..నన్ను నమ్మిన వాళ్లు, ఫాలో అవుతున్నవాళ్లు..ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్. ప్రతీ ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు.. ఎందుకంటే వాళ్లకు నిజానిజాలు తెలసు.. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజాన్ని మిగతా వాళ్లకు కూడా తెలియజేయాలి కాబట్టి..నేను ఈ పోరాటంలో ఉన్నాను..పోరాటంలోకి దిగుతున్నాను అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
Recommended Video

నిజాన్ని బయటకు రానివ్వండి..
ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా ఒంటిరి పోరాటమైనా చేస్తాను.. ఒక్కడినైనా సరే కానీ నిజం బయటకు వచ్చే సరికి.. నిజాన్ని బయటకు రానివ్వండి..నిజం బయటకు వచ్చే వరకు దీన్ని వేరే వేరే దారిలోకి తీసుకెళ్లొద్దు.. ఇది నేను మీ అందర్నీ వేడుకుంటున్నా..న్యాయం అందరికీ జరగాలి.. నాకూ జరగాలి.. నాకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తాను..నా పేరు వాడినందుకు.. మీ ప్రేమ, మద్దతుకు థ్యాంక్స్ అని ప్రదీప్ వీడియోను ముగించాడు.


Click it and Unblock the Notifications











