పెళ్లిపై ఎట్టకేలకు నోరు విప్పిన యాంకర్ ప్రదీప్.. 'ఆ రోజు చెబుతా అంటూ'..

Pradeep Machiraju: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. తనదైన శైలిలో ఎన్నో సూపర్ హిట్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలుత చిన్న పాత్రల్లో కనిపించిన ప్రదీప్.. అనంతరం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'?, 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాల్లో హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే.. బుల్లితెరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో 'ప్రదీప్ మాచిరాజు' పేరు ఎప్పుడూ ముందుంటుంది. 40 ఏళ్లు వచ్చిన ఆయన పెళ్లి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. సోషల్ మీడియాలో తరచూ ఆయన వివాహంపై రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పేర్లతో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ ప్రజాప్రతినిధితో ఆయన వివాహం జరగబోతుందనే ప్రచారం కూడా జరిగింది.

Anchor Pradeep Machiraju Breaks Silence on Marriage Rumours Old Video Goes Viral Again

ఇలా ప్రదీప్ పెళ్లి గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఆయన వివాహంపై తరచూ రూమర్లు వస్తుండగా, తాజాగా మరోసారి ఓ పాత వీడియో వైరలవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహా ఓటీటీలో ప్రసారమైన 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' సీజన్ 4లో పాల్గొన్న ప్రదీప్, తన పెళ్లిపై చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ ప్రొగ్రామ్ కి స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా, నటుడు జీవన్ కుమార్ కో-హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ షోలో ప్రదీప్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ప్రచారాలకు క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోస్ట్ సుమ కనకాల ప్రదీప్‌ను వరుస ప్రశ్నలతో ఆటపట్టించారు. ముందుగా "మీ సినిమా ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు?" అని అడగగా, ప్రదీప్ సరదాగా"మా సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది కదా... అప్పుడే ఒకే చోట అన్ని లొకేషన్లు కనిపిస్తాయి" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

అనంతరం "సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?" అని ప్రశ్నించగా, "ఏప్రిల్ 11న మార్నింగ్ షో పడగానే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, ఆయన సౌండ్ ఏంటో అందరికీ వినిపిస్తుంది" అంటూ మరోసారి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అలాగే హీరోయిన్ సినిమా ఫస్ట్ హాఫ్‌లో కనిపిస్తుందా? సెకండ్ హాఫ్‌లో కనిపిస్తుందా? అని అడిగితే, "మొత్తం సినిమా అంతా కనిపిస్తుంది మేడమ్" అంటూ చమత్కరించారు.

ఇక చివరగా సుమ కనకాల అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్నను సంధించారు. "ప్రదీప్... మీ పెళ్లి ఎప్పుడు?" అని అడగగా, పక్కనే ఉన్న మరో ఆర్టిస్ట్ సరదాగా "ఏప్రిల్ 11నే" అని చెప్పడంతో స్టేజ్ అంతా నవ్వులు పూసాయి. దానికి వెంటనే స్పందించిన ప్రదీప్.. "ఏప్రిల్ 11న మా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత.. ఆరోజే నా పెళ్లి గురించి చెబుతాను" అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.

దీనిపై సుమ కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తూ, "విన్నారా... యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. ఏప్రిల్ 11న సినిమా హిట్ అయిన తర్వాత తన పెళ్లిపై ప్రకటన చేస్తానని 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' వేదికగా ప్రకటించారు" అంటూ ఫన్నీ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. అయితే ఇందులో ప్రస్తావించిన ఏప్రిల్ 11 అనేది అప్పట్లో విడుదల కావాల్సిన సినిమా రిలీజ్ తేదీకి సంబంధించినది మాత్రమే. కాబట్టి దీనిని ప్రదీప్ పెళ్లిపై తాజా ప్రకటనగా భావించాల్సిన అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X