For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాబోయే భార్య ఫొటోతో ప్రదీప్ హల్‌చల్: సస్పెన్స్‌గా ఉంచుతూ రచ్చ.. అతడి కంటే హైట్ ఎక్కువే!

  |

  తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లు ఎంతో కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ల నుంచి పోటీని తట్టుకుని నిలబడడమే కాదు.. నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతూ యాంకరింగ్ రంగంలో రాజు అనిపించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన టాలెంట్‌తో వరుస ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోన్న అతడు.. తిరుగులేని రికార్డులతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తనకు కాబోయే భార్య అంటూ ఓఫొటోతో యాంకర్ ప్రదీప్ హల్‌చల్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  రేడియో జాకీ నుంచి టాప్ యాంకర్‌గా

  రేడియో జాకీ నుంచి టాప్ యాంకర్‌గా

  ఇప్పుడు తెలుగులో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్ మాచిరాజు.. రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు. అందులో చాలా కాలం పాటు సత్తా చాటిన తర్వాత యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆరంభంలోనే 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. దీంతో నంది అవార్డును కూడా అందుకుని.. అప్పటి నుంచి వరుస షోలతో దూసుకెళ్తున్నాడు.

   ఎంత మంది ఉన్నా అతడిపైనే ఫోకస్

  ఎంత మంది ఉన్నా అతడిపైనే ఫోకస్

  ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ రంగంలో హవాను చూపించడానికి అతడి టాలెంటే ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్యంతో అదరగొట్టే అతడు.. పక్కన ఎంత మంది ఉన్నా ప్రతి కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. తద్వారా ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు.

   అందులోనూ సత్తా.. మొదటిదే హిట్టు

  అందులోనూ సత్తా.. మొదటిదే హిట్టు

  బుల్లితెరపైనే కాదు.. ప్రదీప్ మాచిరాజు గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో ఇటీలవ హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ హిట్ చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా అదిరిపోయే ఆరంభం దక్కినట్లైంది.

   ఫుల్ బిజీగా ప్రదీప్.. వీటిలో సందడిగా

  ఫుల్ బిజీగా ప్రదీప్.. వీటిలో సందడిగా

  సుదీర్ఘ కాలంగా తెలుగులో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్. ఈ క్రమంలోనే మరిన్ని షోలతో దూసుకుపోతూనే ఉన్నాడు. అన్ని ఛానెళ్లలోనూ ఏక కాలంలో పని చేస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 13', 'డ్రామా జూనియర్స్', 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లను హోస్ట్ చేస్తున్నాడు.

  కాబోయే భార్య పిక్‌తో ప్రదీప్ హల్‌చల్

  ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఇందులో సూర్యకాంతం వర్సెస్ త్రినయని సీరియల్ నటీనటుల మధ్య పోటీ జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్ ప్రదీప్ తనకు కాబోయే భార్య అంటూ ఓ ఫొటోను పట్టుకుని రచ్చ చేశాడు.

   సస్పెన్స్‌గా ఉంచి రచ్చ... అతడి కంటే

  సస్పెన్స్‌గా ఉంచి రచ్చ... అతడి కంటే

  ఆరంభంలో మురారి సినిమాలోని 'ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక' అనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. అతడి చేతిలో ఓ అమ్మాయి ఫొటో ఉంది. అంతేకాదు, ఈరోజు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. ఇక, సీరియల్ నటీనటులు అతడిపై పంచులు వేశారు. 'ఆ అమ్మాయి ఎవరో గానీ నీ కంటే ఎత్తుగానే ఉంటుంది' అంటూ ఓ సీనియర్ నటి సెటైర్ వేసింది.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Super Serial Championship Season 3 Show. He Bring his Fiance Photo in This Show. This Promo video gone viral in Internet
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X