అత్తో అత్తమ్మ అంటూ రమ్యకృష్ణతో ప్రదీప్ హంగామా.. శివగామి పంచులకు కాళ్లు మొక్కిన యాంకర్

ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగు టీవీలో సరిగమప పేరుతో ప్రసారమవుతున్న సరిగమప షోలో యాంకర్ ప్రదీప్ రచ్చ మాములుగా లేదు. ఈ షోకు స్పెషల్ గెస్టుగా వచ్చిన శివగామి రమ్యకృష్ణతో చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. కోటి, సింగర్ కల్పన జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో వినోదభరితంగా సాగడం విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ షోలో రమ్యకృష్ణతో ప్రదీప్ చేసిన డ్యాన్స్ గురించి..

జీ తెలుగులో ప్యూచర్ సింగర్ షో

జీ తెలుగులో ప్యూచర్ సింగర్ షో

తెలుగులో దాదాపు అన్నీ ప్రముఖ ఛానెల్స్‌లో యాంకర్ ప్రదీప్ షోలు ఇప్పుడ టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నాయి. ఈటీవీలో ఢీతోపాటు పలు ఛానెల్స్‌లో ప్రదీప్ హవా కొనసాగుతున్నది. తాజాగా జీ తెలుగు ఛానెల్స్‌లో ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సరిగమప ఫ్యూచర్ సింగింగ్ ఐకాన్ షో‌కు సంబంధించిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ కార్యక్రమంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అల్లుడా మజాకా చిత్రంలో పాటకు

అల్లుడా మజాకా చిత్రంలో పాటకు

తాజాగా జీ టెలివిజన్ రిలీజ్ చేసిన ప్రోమోలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో ప్రదీప్ వేసిన స్టెప్పులు ఆకట్టుకొన్నాయి. అత్తో అత్తమ కూతురో అంటూ చిరంజీవి నటించిన అల్లుడా మజాకా పాటకు రమ్యకృష్ణతో కలిసి ప్రదీప్ డ్యాన్స్ చేశారు. ప్రదీప్ స్టెప్పులకు అనుగుణంగా రమ్యకృష్ణ డ్యాన్స్ చేసి సత్తా చాటారు. ప్రదీప్, రమ్యకృష్ణ డ్యాన్స్ చేస్తుంటే కంటెస్టెంట్లు, జడ్జీలు చప్పట్లు, ఈలలు వేస్తూ హంగామా చేశారు. అల్లుడా మజాకాలో రమ్యకృష్ణ కూడా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ప్రదీప్‌కు రమ్యకృష్ణ సూపర్ పంచ్

ప్రదీప్‌కు రమ్యకృష్ణ సూపర్ పంచ్

రమ్యకృష్ణతో డ్యాన్స్ చేసిన తర్వాత ప్రదీప్ మాట్లాడారు. నా భయంకరమైన స్టెప్పులతో మిమ్నల్ని బాగా ఇబ్బంది పెట్టాననుకొంటాను ప్రదీప్ అంటే అవును నిజంగా అంటూ పంచ్ రమ్యకృష్ణ సూపర్ పంచ్ ఇచ్చారు. రమ్యకృష్ణ ఇచ్చిన పంచ్‌తో ప్రదీప్ ముఖం తిప్పేసుకోవడం, షోలో ఉన్న వాళ్లంత నవ్వుల్లో మునిగిపోయారు.

ప్రదీప్‌కు పెళ్లి ఎందుకు అంటూ రమ్యకృష్ణ

ప్రదీప్‌కు పెళ్లి ఎందుకు అంటూ రమ్యకృష్ణ


ప్రదీప్, రమ్యకృష్ణ జోరు వేదికపై కొనసాగుతుండగా క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్, జడ్జీ కోటి జోక్యం చేసుకొంటూ.. మీరు ఒక్క పాట పడితే వినాలని ఉంది అంటే.. రోజ్ రోజ్ రోజా పువ్వా అంటూ తనదైన శైలిలో పాడారు. ఆ తర్వాత ఒక్క రిక్వెస్ట్ అంటూ మళ్లీ కోటి మాట్లాడుతూ.. ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకొంటాడో అడగండి అంటే.. పెళ్లి ఎందుకు అని రమ్యకృష్ణ ఠక్కున సమాధానం ఇచ్చారు. దాంతో అబ్బా.. ఏం సమాధానం చెప్పారంటూ రమ్యకృష్ణ కాళ్లు మొక్కుతూ ప్రదీప్ సంతోషంలో మునిగిపోయారు.

పాపం అమ్మాయి బలైపోతుందంటూ మరో పంచ్

పాపం అమ్మాయి బలైపోతుందంటూ మరో పంచ్

పెళ్లి ఎందుకంటూ కోటికి రమ్యకృష్ణ సమాధానం ఇవ్వగానే సంతోషంలో మునిగిపోయిన ప్రదీప్‌కు ఆమె మరో షాక్ ఇచ్చింది. పాపం అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేయడం అంటూ రమ్యకృష్ణ పంచులు విసిరింది. దాంతో మళ్లీ ప్రదీప్‌ షాక్ తినడం తన వంతైంది. అలా తాజా ప్రోమోలో సందడి వాతావరణం కనిపించింది.

Recommended Video

Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
రమ్యకృష్ణకు ప్రదీప్ బర్త్ డే విషెస్

రమ్యకృష్ణకు ప్రదీప్ బర్త్ డే విషెస్


సరిగమప ఫ్యూచర్ సింగింగ్ ఐకాన్‌ షోలో రమ్యకృష్ణ బర్త్ డే వేడుకల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే అంటూ ప్రదీప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ప్రేమ, సంతోషాన్ని పంచిన మీకు సో మచ్ థ్యాంక్స్ అంటూ ప్రదీప్ మాచిరాజు ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X