షాకింగ్: ఈటీవీకి హ్యాండిచ్చిన యాంకర్ ప్రదీప్.. ఆమె కోసం మరో ఛానెల్‌లోకి ఎంట్రీ!
బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తున్న తరుణంలోనే ఎంట్రీ ఇచ్చి... తక్కువ సమయంలోనే విశేషమైన ప్రజాదరణను అందుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. స్పాంటీనియస్‌గా పంచులు వేయగల నేర్పుతో పాటు చక్కని వాక్‌చాతుర్యం ఉన్న యాంకర్ కావడంతో... అతడు వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. అదే సమయంలో యూత్‌తో పాటు లేడీ ఫ్యాన్స్ నుంచి ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు. ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా కొనసాగుతోన్న ప్రదీప్... ఈటీవీకి హ్యాండిచ్చాడని ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

యాంకర్‌గా అదుర్స్.. అందుకే ప్రదీప్ టాప్
‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు. దాని తర్వాత ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. చాలా కాలం పాటు ప్రసారం అయిన ఈ షోతో టీవీ నంది పురస్కారం కూడా అదుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో షోల ఆఫర్లు అందుకున్నాడు. అన్నింట్లోనూ చక్కగా రాణిస్తూ టాప్ యాంకర్ అయ్యాడు.

సొంతంగా ఓ షో... ఢీతో భారీ పాపులారిటీ
ప్రదీప్ కెరీర్‌కు ‘గడసరి అత్త సొగసరి కోడలు' తొలి విజయాన్ని అందిస్తే, ఆ తర్వాత కొన్ని షోలు అతడి పాపులారిటీని అమాంతం పెంచేశాయి. అందులో ఒకటి ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను'. ఈ షోకు రూపకల్పన చేయడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించాడు ఈ టాలెంటెడ్ యాంకర్. ఆ తర్వాత ‘ఢీ' అతడికి భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణమైందనే చెప్పాలి.

ఇక్కడ సక్సెస్... అక్కడ మాత్రం ఇలాగ
యాంకర్‌గా ప్రదీప్ ఎన్నో విజయవంతమైన షోలకు పని చేశాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. వాటిలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ సినిమా ‘జులాయి', నాగ చైతన్య హిట్ మూవీ ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ప్రేమించడం నేర్పిస్తానంటున్న యాంకర్
ఇన్ని రోజులూ యాంకర్‌గా, చిన్న చిన్న పాత్రలు చేసిన ఆర్టిస్టుగా కనిపించిన ప్రదీప్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అతడు లవ్ గురూలా కనిపించనున్నాడు. 1947లో జరిగే పీరియాడికల్ కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

అటు నుంచి ఇటు.. ప్రదీప్ ప్రయాణమిది
కెరీర్ ఆరంభంలో జీ నెట్‌వర్క్ వారి జీ తెలుగు ఛానెల్‌తో పని చేశాడు యాంకర్ ప్రదీప్. ఆ ఛానెల్‌లోనే చాలా కాలం పాటు మంచి మంచి కార్యక్రమాలను హోస్ట్ చేశాడు. ఆ సమయంలోనే యాంకర్‌గా గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత ఈటీవీలోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలతో పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నాడు.

ఈటీవీకి హ్యాండిచ్చిన యాంకర్ ప్రదీప్
‘ఢీ', ‘ఎక్స్‌ప్రెస్ రాజా' సహా పలు కార్యక్రమాలతో సూపర్ క్రేజ్‌ను అందుకున్నాడు ప్రదీప్. మరీ ముఖ్యంగా ‘ఢీ'లో అతడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అతడి ట్రాక్ జబర్ధస్త్ కామెడీని మించిపోయేలా ఉంటుంది. ప్రదీప్ కారణంగానే ఈ షో రేటింగ్ కూడా పెరుగుతోందన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఈటీవీ నుంచి తప్పుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
Recommended Video

బాపు బొమ్మ కోసం ఆ ఛానెల్‌లోకి ఎంట్రీ.!
ప్రదీప్ ఈటీవీ నుంచి తప్పుకోవడం నిజమో కాదో తెలియదు కానీ.... ఈ ప్రచారం తెరపైకి రావడానికి కారణం మాత్రం తెలిసింది. వినాయక చవితి సందర్భంగా జీ తెలుగు ‘బాపు బొమ్మకు పెళ్లంట' అనే ఈవెంట్ రెడీ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోకు కూడా వదిలింది. ప్రదీప్ ఈ ఈవెంట్‌ను హోస్ట్‌గా చేయనున్నాడు. ప్రోమోలో అతడి వాయిస్ వినిపించడంతోనే ఈ ప్రచారం మొదలైంది.


Click it and Unblock the Notifications











