యాంకర్ ప్రదీప్‌పై మనసుపడ్డ నటి.. అలా బయటపెట్టిన డింపుల్ బ్యూటీ

తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజుదే ఉంటుంది. సోషల్ మీడియాలో అతని పెళ్లిపై ఎన్నోసార్లు డిస్కషన్ నడిచింది... త్వరలోనే ప్రదీప్ పెళ్లి అంటూ పలు రకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ తర్వాత అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. పలు షోలకు వచ్చిన సెలబ్రిటీలు కూడా నేరుగా ఇదే ప్రశ్నతో అతని మీద పంచ్‌లు విసిరిన సందర్భాలెన్నో. అయినప్పటికి నవ్వుతూ తప్పించుకున్నాడే కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు ప్రదీప్ మాచిరాజు. తాజాగా ఓ టీవీ షోలో బుల్లితెర నటి గోమతి ప్రియ.. ప్రదీప్‌పై ఇష్టాన్ని బయటపెడుతూ సిగ్గుపడిపోయింది. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దీనికి ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. జడ్జిలుగా అరుణ ముచ్చర్ల, కమెడియన్ అలీ, నటి శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మాలు వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రకరకాల థీమ్స్, వెరైటీ వంటకాలతో జడ్జిలు ఇస్తున్న టాస్క్‌లు.. టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పడుతున్న పాట్లు, వారి అల్లరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అల్లరిని చూస్తే..

Anchor Pradeep Machiraju Gets Cute Proposal Hint from Gomathi Priya on Cooku With Jathiratnalu

తొలుత ప్రోమోలో భాగంగా రెండు బోర్డులపై కర్టెన్ కప్పి ఉంటుంది. కుక్ ఓ వైపు.. జాతిరత్నం ఓ వైపు ఉంటారు. ఇద్దరికీ ఆ బోర్డ్ మీద ఏముందో చూపిస్తానని ప్రదీప్ టాస్క్ చెబుతాడు. ముందు మేం రాసేసినాక అడుగుతారా? అడిగిన తర్వాత మేం రాయాలా? అని ఎక్స్‌ప్రెస్ హరి అడగ్గా.. ఇప్పుడు నేను కొట్టాక సౌండ్ వస్తుందా? సౌండ్ వచ్చాక కొట్టాలా అని ప్రదీప్ కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. అయితే తాను చూడలేదని .. కర్టెన్ రెండు సెకన్లు చూపించాలని అడుగుతాడు ఎక్స్‌ప్రెస్ హరి.

తర్వాత టేబుల్ మీద పేర్చిన గ్రోసరి వస్తువులను రుచి చూసి కనిపెట్టాలని టాస్క్ ఇస్తాడు ప్రదీప్.. ముందుగా రౌడీ రోహిణి వచ్చి టేస్ట్ చూస్తూ కామెడీ చేస్తుంది. తర్వాత పైన్ యాపిల్ ఏ నెంబర్‌లో ఉందని ఇమ్మాన్యుయేల్‌ను అడుగుతాడు ప్రదీప్. అసలు పైన్ యాపిల్ ఉందా? దీంట్లో అంటూ ఇమ్మాన్యుయేట్ నోరెళ్లబెడతాడు. నెంబర్ 8లో ఏ ఫ్రూట్ ఉందని ప్రదీప్ అడగ్గా.. ఫస్ట్ దే నేను మరిచిపోతున్నానని ఇమ్మాన్యుయేల్ చెబుతాడు. అనంతరం బిగ్‌బాస్ మణికంఠ, అవినాష్, దీపిక రంగరాజులను పచారీ సరుకుల గురించి అడుగుతూ కామెడీ చేస్తాడు ప్రదీప్.

ఆ తర్వాత బుల్లితెర నటి గోమతి ప్రియను కర్టెన్ దగ్గరికి పిలిచిన ప్రదీప్ కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా.. ఏ ఫర్ అంటే ఏంటీ అని అడుగుతాడు అలీ. దానికి యాపిల్ అని సమాధానం చెబుతుంది గోమతి ప్రియ. మరి పీ ఫర్ అంటే ఏటీ అని అలీ అడగ్గా.. పీ ఫర్ ప్రదీప్ అని చెబుతూ సిగ్గుపడుతుంది గోమతి ప్రియ. దాంతో అంతా అరుపులు, కేకలతో గోలగోల చేస్తారు. ఎక్స్‌ప్రెస్ హరి డ్యాన్స్ వేస్తూ ప్రదీప్‌ని ఆటపట్టిస్తుండగా.. ఎక్కడైనా పీ ఫర్ ప్రదీపే దానికి సెపరేట్‌గా మ్యూజిక్ వేయాల్సిన అవసరం లేదని కౌంటర్ వేస్తాడు ప్రదీప్. ఆ తర్వాత గోమతి ప్రియ బోర్డు మీద రాసింది చదివి అందరినీ నవ్విస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రదీప్‌ను త్వరగా పెళ్లి చేసుకోమంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X