అన్నా ర్యాగింగ్ తట్టుకోలేకపోతున్నా. నీ పేరు చెబితే ఇంకా దారుణంగా.. యాంకర్ ప్రదీప్‌ను..
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న ప్రదీప్ మాచిరాజు లాక్‌డౌన్ తర్వాత మరో క్రేజీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ తెలుగు టీవీలో సారేగామపా పేరుతో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సింగింగ్ ఐకాన్ ఎంపిక లక్ష్యంగా షో మళ్లీ ప్రారంభమైంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకొనే విధంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రోమోలో యాంకర్ ప్రదీప్‌ను కంటెస్టెంట్లు, జడ్జీలు ఎలా ఆడుకొన్నారంటే..

యువ గాయకుల ప్రతిభకు పదను పెట్టేలా
జీ తెలుగు మ్యూజిక్ ప్రధానమైన షోను మళ్లీ మొదలుపెట్టింది. సారేగామాపా అనే పేరుతో యువ గాయకుల ప్రతిభకు ప్రోత్సాహం కల్పించేలా షోను డిజైన్ చేశారు. ఈ షోకు టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ కల్పన తదితరులు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. పలువురు సింగర్లు మెంటర్లుగా ఉన్నారు.

రమ్యకృష్ణ స్పెషల్ గెస్టుగా
తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. సౌత్ ఇండస్ట్రీలో క్వీన్ రమ్యకృష్ణ ప్రత్యేక అతిథిగా హజరవుతున్నట్టు స్పష్టమైంది. ఈ కార్యక్రమంలో ప్రదీప్‌ను ఓ రేంజ్‌లో రమ్యకృష్ణ సెటైర్లు వేశారు. అలాగే కోటి, కల్పన కూడా ప్రదీప్‌ను ఆటపట్టించారు. ఇలా సరదాగా యువ గాయకులతో పాటల పోటీ రంజుగా సాగింది.

అమ్మాయిలా డ్యాన్స్ చేసిన ప్రదీప్
అలాగే, ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూర్చిన ఓ పాటకు ప్రదీప్‌ను సింగర్ కల్పన డ్యాన్స్ చేయమంటే.. ఒక ఓణి చుట్టుకొని అమ్మాయిలా డ్యాన్స్ చేశాడు. ప్రదీప్ డ్యాన్స్ చేస్తుంటే కల్పన, కోటితోపాటు అందరూ ఫుల్లుగా ఎంకరేజ్ చేశారు. అలా ప్రదీప్‌ను ఫుల్లుగా ఈ షోలో వాడేసుకొంటున్నారనేది స్పష్టంగా అర్ధమైంది.
Recommended Video

ర్యాంగింగ్ అంటూ ప్రదీప్‌పై సెటైర్లు
సారేగామాపా షోలో ఓ యువ సింగర్ తనను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రదీప్‌కు కంప్లయింట్ చేశారు. అయితే ఎలాంటి ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రదీప్ అడిగితే.. షర్ట్ విప్పేయమంటున్నారంటున్నారు అని వెల్లడించాడు. అయితే నా పేరు చెప్పకపోయావా? అని ప్రదీప్ అంటే.. మీ పేరు చెబితే అన్ని విప్పేస్తామంటున్నారు అంటూ యువ సింగర్ ఝలక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











