Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ పెళ్లిపై మళ్లీ రచ్చ... ఈసారి అమ్మాయి ఎవరంటే?

సాధారణంగా బుల్లితెరపై యాంకర్​ అంటే ఎక్కువగా అమ్మాయిలే కనిపిస్తుంటారు. వాళ్ల అందానికి తట్టుకుని నిలబడాలంటే అబ్బాయిలలో వారికన్నా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఎక్కువగానే ఉండాలి. అలా ప్రస్తుతం తెలుగు స్మాల్​ స్క్రీన్​పై వాళ్ల పోటిని తట్టుకుని మరీ రాణిస్తున్న స్టార్​ మేల్​ యాంకర్స్​లో ప్రదీప్​ మాచిరాజు ఒకరు. తనదైన యాంకరింగ్‌తో చాలా కాలం నుంచే సత్తా చాటుతున్నాడు. అయితే అతడి పర్సనల్ లైఫ్​ గురించి, ముఖ్యంగా అతడి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటోంది. తాజాగా మరోసారి అతడి పెళ్లి గురించి చర్చలు ఎక్కువయ్యాయి. దాని గురించి ఈ కథనం...

వరుస ఆఫర్లతో కెరీర్​లో ముందుకు : కెరీర్ ప్రారంభంలోనే బెస్ట్ యాంకర్​గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఆ తర్వాత చాలా షోలకు, కార్యక్రమాలకు, ఈవెంట్లకు హోస్ట్​గా వ్యవహరించాడు. ఇప్పటికీ వరుస షోలను చేస్తూ ఆడియెన్స్​ను అలరిస్తున్నాడు. తనదైన శైలిలో అదిరిపోయే వాక్చాతుర్యం, స్పాట్ పంచెస్​ వేయగల టాలెంట్‌తో కెరీర్​లో ముందుకు సాగుతున్నాడు. లుక్స్‌ పరంగానూ మెస్మరైజ్ చేసేస్తున్నాడు. అలా తన ప్రతిభ అండ్ లుక్స్​తో మంచి మంచి ఆఫర్లను అందుకుంటున్నాడు.

Anchor Pradeep Machiraju Marriage Rumours Again Viral in Social Media

ఆ తర్వాత ఏం చేయలేదు : అయితే హోస్ట్​గా అలరిస్తున్న ప్రదీప్​.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదట సపోర్టింగ్ రోల్స్ చేస్తూ పలు చిత్రాల్లో కనిపించాడు. అలా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వేలేదనిపించింది. కానీ, ఆ తర్వాత అతడు మళ్లీ ఏ సినిమా చేయలేదు.

పుకార్లు షికార్లు చేస్తుంటాయి : ఇక తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్​ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రదీప్ మాచిరాజుదే. చాలా కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే మరోసారి అతడి పెళ్లి గురించి రచ్చ మొదలైంది.

Anchor Pradeep Machiraju Marriage Rumours Again Viral in Social Media

పెళ్లి చేసేశారు గురూ : రీసెంట్​గా నటి మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్​ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచీ రాజు కూడా ఈ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశాడు. మెరూన్ కలర్ ఔట్ ఫిట్‌లో టాప్ టు బాటమ్ స్టైలిష్ లుక్​లో దర్శనమిచ్చాడు.

తన స్టైల్ లుకింగ్​తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రెడీ ఫర్ టీచ్ ఫర్ చేంజ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్​గా మారాయి. 'సరే కానీ పెళ్లి తేదీ ఎప్పుడు', 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్​ బ్రదర్'​ అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది 'హ్యాపీ మ్యారేజ్ లైఫ్' అన్నా అంటూ ప్రదీప్​కు పెళ్లి కూడా చేసేస్తున్నారు. అయితే ఈ సారి ఏ అమ్మాయి పేరు నెటిజన్లు ఉపయోగించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X