ఇంట్రెస్టింగ్: ‘ఢీ’ షో నుంచి యాంకర్ ప్రదీప్ ఔట్.. అక్కడ ఎంట్రీ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం.!
తెలుగు బుల్లితెర హిస్టరీలో కొంత మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చాలా కాలం నుంచి యాంకరింగ్‌లో తనదైన ముద్రను వేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఒకడు. తెలుగు రాష్ట్రాల్లో అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ టీవీ రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు చాలా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఫేమస్ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నాడు. దీంతో మరోసారి అతడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది.?

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడ కూడా ఎంట్రీ
ప్రదీప్ యాంకర్‌గా ఎన్నో విజయవంతమైన షోలలో పని చేశాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. వాటిలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అలాగే మరికొన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ప్రదీప్ గొప్ప యాంకరింగ్‌కు ఇదో నిదర్శనం
యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రదీప్ మంచి పేరును సంపాదించుకున్నాడు. అప్పటికప్పుడు ఎదుటి వాళ్లపై పంచులు పేల్చడంతో పాటు అనర్గళంగా మాట్లాడగలిగే స్వభావం ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే కార్యక్రమానికి గాను ప్రదీప్‌కు టీవీ నంది పురస్కారం అదుకున్నాడంటే అతడి సత్తా అర్థం చేసుకోవచ్చు.

ప్రదీప్ మిస్సింగ్.. పుకార్లు షికార్లు
కొద్ది రోజుల క్రితం యాంకర్ ప్రదీప్ మిస్సింగ్ హాట్ టాపిక్ అయిపోయింది. చాలా కాలంగా బిజీ బిజీగా గడుపుతున్న అతడు.. ఈ మధ్య ఏ షోలోనూ కనిపించకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అతడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కొందరు అనగా.. ప్రదీప్‌కు యాక్సిడెంట్ అయిందని మరికొందరు ప్రచారం చేశారు. దీంతో అతడే స్వయంగా కారణాలను వెల్లడించాడు.
‘ఢీ’ షో నుంచి యాంకర్ ప్రదీప్ ఔట్
కొన్ని సీజన్లుగా ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘ఢీ' షోకు యాంకరింగ్ చేస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. అతడి పంచులతో ఈ షోకు మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ యాంకర్ ‘ఢీ' నుంచి తప్పుకున్నాడట. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో అతడు కనిపించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

అక్కడ ఎంట్రీ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం.!
ప్రస్తుతం యాంకర్‌గా సూపర్ సక్సెస్‌ఫుల్ అవుతున్న ప్రదీప్.. సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఈ మధ్య ప్రచారం మొదలైంది. ఆ మధ్య దానికి సంబంధించిన షూటింగ్‌లో గాయపడడం వల్లే యాంకరింగ్‌కు దూరమయ్యాడని అన్నారు. ఇప్పుడు కూడా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ వల్ల ‘ఢీ' షో నుంచి తప్పుకున్నాడని తాజా సమాచారం.

‘ఢీ’ చాంపియన్స్ గురించి
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘ఢీ'. ఇప్పటికి పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవల ‘ఢీ చాంపియన్స్' పేరిట మరో సీజన్ ప్రారంభించింది. ఈ షో ద్వారానే శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.


Click it and Unblock the Notifications











