For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన ప్రదీప్: అవసరానికి ఫోన్ చేస్తే అలా.. సీక్రెట్ లీక్ చేసిన యాంకర్

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. వీళ్లంతా గ్లామర్ ప్రపంచంలో అందంతో పాటు టాలెంట్‌తో ఎలాగోలా నెగ్గుకుని వస్తున్నారు. ఇంత మంది పోటీ ఉన్నా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన టైమింగ్‌తో సందడి చేస్తూ.. ప్రతి కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు. ఫలితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు ఓ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

   అలా ఎంట్రీ ఇచ్చాడు... ఇలా పాపులారిటీ

  అలా ఎంట్రీ ఇచ్చాడు... ఇలా పాపులారిటీ

  ప్రదీప్ మాచిరాజు రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు. అందులో చాలా కాలం పాటు పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న అతడు.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా మారాడు. తొలినాళ్లలోనే మంచి టాలెంట్‌తో పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బాయ్.. 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి పలు ఛానెళ్లలో వరుసగా కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నాడు.

  బిగ్ బాస్‌‌లోకి స్పెషల్ కంటెస్టెంట్: ఐదో సీజన్‌లోకి జబర్ధస్త్ లేడీ.. షో చరిత్రలోనే ఇది రెండోసారి!
  https://telugu.filmibeat.com/television/jabardasth-priyanka-singh-will-entry-to-bigg-boss-telugu-5-show-101558.html

  అతడి సక్సెస్‌కు కారణమదే.. నెంబర్ వన్

  అతడి సక్సెస్‌కు కారణమదే.. నెంబర్ వన్

  యాంకరింగ్ ఫీల్డులో పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. అందులో నెగ్గుకు రావాలంటే ప్రత్యేకమైన స్పెషాలిటీలు ఉండాలి. అందుకు అనుగుణంగానే ప్రదీప్ మాచిరాజు అద్భుతమైన టైమింగ్‌తో దూసుకెళ్తున్నాడు. కమెడియన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా పంచులు వేస్తూ ప్రతి దాన్ని వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. దీంతో మేల్ యాంకర్లలో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతున్నాడు ప్రదీప్.

  వెండితెరపైనా సత్తా.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ

  వెండితెరపైనా సత్తా.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ

  బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న ప్రదీప్.. చాలా రోజుల క్రితమే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ విజయవంతమైన చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ దక్కింది. దీంతో మరిన్ని కథలను కూడా వింటున్నాడతను.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  చేతి నిండా షోలు.. ప్రదీప్ చేస్తున్నవి ఇవే

  చేతి నిండా షోలు.. ప్రదీప్ చేస్తున్నవి ఇవే

  సుదీర్ఘమైన కెరీర్‌లో యాంకర్ ప్రదీప్ ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని షోలతో దూసుకుపోతూనే ఉన్నాడు. అన్ని ఛానెళ్లలోనూ ఏక కాలంలో పని చేస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 13', 'డ్రామా జూనియర్స్', 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో పలు సినిమాల్లోనూ నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

  డ్రామా జూనియర్స్‌లో బాలయ్య స్పెషల్‌గా

  డ్రామా జూనియర్స్‌లో బాలయ్య స్పెషల్‌గా

  యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం 'డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల షోను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సీనియర్ కమెడియన్ బాబు మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌లో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్‌గా ఓ స్కిట్‌ను చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

   బాలకృష్ణ క్యారెక్టర్‌ను బయటపెట్టిన ప్రదీప్

  బాలకృష్ణ క్యారెక్టర్‌ను బయటపెట్టిన ప్రదీప్

  'డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' షోలో జూనియర్ బాలకృష్ణ పేరొందిన ప్రజ్వల్ నటసింహా గెటప్‌లతో అదరగొడుతున్నాడు. ఈ ఎపిసోడ్‌లోనూ ఈ చిన్నారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇక, ఈ స్కిట్ తర్వాత పిల్లలంతా జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ ఆయన కటౌట్‌ను తీసుకొచ్చారు. ఆ సమయంలో అలీ, బాబు మోహన్ కూడా నందమూరి హీరో గొప్పదనాన్ని వివరించారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు బాలకృష్ణ క్యారెక్టర్‌ను బయట పెట్టేశాడు.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  అవసరానికి ఫోన్ చేస్తే అలా అన్నారంటూ

  అవసరానికి ఫోన్ చేస్తే అలా అన్నారంటూ

  స్కిట్ అయిపోయిన తర్వాత యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. 'ఆయన తీరు, ఆయన స్టైల్‌ ఎప్పుడూ అలా సింహం లాగే ఉంటుంది. క్యాన్సర్ ఆస్పత్రిలో కానీ, ఎక్కడైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ నేను ఆయనకే ఫోన్ చేస్తాను. అప్పటికప్పుడు కాల్స్ చేసి బాలయ్య బాబు గారు ఎంతో మందికి ట్రీట్‌మెంట్ చేయించారు. అర్ధరాత్రైనా నాకు ఫోన్ చెయ్ అన్నారాయన. ఆ ఒక్క మాట చాలు, ఆయనిచ్చిన ధైర్యం చాలు' అంటూ నటసింహా నందమూరి బాలకృష్ణ చేస్తున్న గొప్ప గొప్ప పనుల గురించి, ఆయన సేవా భావం గురించి వివరించాడు.

  Recommended Video

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్


  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Drama Juniors – The NEXT Superstar Show. Now He Praises on Nandamuri Balakrishna In Latest Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X