హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్.. ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగలడంతో కీలక నిర్ణయం
తెలుగు బుల్లితెర చరిత్రలో ఎంతో మంది యాంకర్లు ఉన్నా అత్యంత గుర్తింపును దక్కించుకున్న వాళ్లు మాత్రం తక్కువే. అందులోనూ మగ యాంకర్లనైతే వేళ్లపై లెక్కించవచ్చు. వీరిలో ప్రదీప్ మాచిరాజు పేరును ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే. ప్రస్తుతం యంగ్ యాంకర్ ఎన్నో షోలతో బిజీగా గడుపుతున్నాడు. అయినా.. ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్‌తోనూ ప్రదీప్‌కు అనుబంధం
ప్రదీప్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు. అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలోనే మరికొన్ని ఆఫర్లు వచ్చినా బిజీ షెడ్యూల్ వల్ల తిరస్కరిస్తున్నాడట ఈ యంగ్ యాంకర్.

నంది అవార్డును కూడా అందుకున్నాడు
ఈ యంగ్ యాంకర్‌కు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అతడిలో ఉన్న టాలెంట్‌తో పాటు అనర్గళంగా మాట్లాడ గల నైపుణ్యమే. వీటి వల్లే ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే కార్యక్రమానికి గాను ప్రదీప్‌కు టీవీ నంది పురస్కారం లభించింది.

ఆ షోను క్రియేట్ చేసింది ప్రదీపే
ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను' అనే ప్రోగ్రామ్‌ను రూపొందించింది ప్రదీపే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ షో ద్వారా సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. దీనికి ఎంతో మంది సినీ హీరోలు, హీరోయిన్లు వచ్చిన విషయం తెలిసిందే.

కనిపించకుండా వెళ్లాడు.. పుకార్లు షికార్
బుల్లితెరపై బిజీగా గడుపుతున్న ప్రదీప్.. ఇటీవల కొద్ది రోజులు కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా అతడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, యాక్సిడెంట్ అయిందని ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రదీప్ జరిగిందంతా చెప్పాడు.

హీరోగా ఎంట్రీ.. ఆదిలోనే ఎదురుదెబ్బ
ప్రదీప్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అతడు ఓ కొత్త దర్శకుడితో కలిసి 1940వ దశకానికి సంబంధించిన కథతో సినిమా చేస్తున్నాడట. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ షాక్‌కు గురి చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణకు అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అవడంతో దీనిని ఆపేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ కోసం ప్రదీప్ కీలక నిర్ణయం
ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్న మొదటి సినిమా ఆగిపోయిందన్న వార్త వచ్చిన సమయంలో.. అతడు తాజాగా మరో మూవీని ఫైనలైజ్ చేశాడని ఓ వార్త బయటకు వచ్చింది. దీనిని బడా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన ఓ యంగ్ క్రియేటర్ తెరకెక్కిస్తాడని సమాచారం. పూర్తి లవ్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాలో ప్రదీప్ లవ్ టిప్స్ ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడని టాక్.


Click it and Unblock the Notifications











