ఆ సింగర్‌తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్: మనోడి రొమాంటిక్ యాంగిల్‌కు షాకైన అమ్మాయి.!

By Manoj Kumar P

యాంకరింగ్ అంటే కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అదరగొడతాడు అని నిరూపించిన వాళ్లలో ప్రదీప్ మాచిరాజు ఒకడు. లేడీ యాంకర్ల హవా కనిపిస్తోన్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతడు... అద్భుతమైన టాలెంట్‌ను చూపించి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయాడు. అంతేకాదు, వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ స్టార్ యాంకర్‌పై అమ్మాయిల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ సింగర్‌తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం మొదలైంది. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళితే....

ఈ ఘనత సాధించిన ఏకైక యాంకర్

ఈ ఘనత సాధించిన ఏకైక యాంకర్

చాలా కాలం క్రితం బుల్లితెరకు యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. జీ తెలుగు ఛానెల్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు... అందులో ఎన్నో షోలను చేశాడు. మరీ ముఖ్యంగా ‘గడసరి అత్త సొగసరి కోడలు'తో మంచి గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో బెస్ట్ యాంకర్‌గా పలుమార్లు నంది అవార్డును కూడా అందుకున్నాడు.

అన్నీ చోట్లా యాంకర్ ప్రదీప్‌దే హవా

అన్నీ చోట్లా యాంకర్ ప్రదీప్‌దే హవా

జీ తెలుగు ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ... ప్రదీప్ దాదాపు అన్ని ఛానెళ్లలోనూ యాంకర్‌గా పని చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్ షోలను హోస్ట్ చేశాడు. తద్వారా మంచి పేరును దక్కించుకున్నాడు. ప్రదీప్ యాంకర్‌గా పని చేస్తున్న షోలలో ‘ఢీ' ప్రత్యేకమనే చెప్పాలి. ఈ షో ద్వారా అతడిలోని కామిక్ యాంగిల్ కూడా బయట పడింది. దీంతో మరింత హైలైట్ అయ్యాడు.

చెడ్డపేరు తెచ్చిన షో.. మారలేదుగా

చెడ్డపేరు తెచ్చిన షో.. మారలేదుగా

యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో ప్రదీప్ ‘పెళ్లి చూపులు' అనే షో చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రసారం అయిన ఈ షో... అంతగా ప్రేక్షకాదరణను పొందలేదు. పైగా విమర్శలను ఎదుర్కొంది. ఈ షో వల్ల ప్రదీప్ కెరీర్‌కు సైతం దెబ్బ పడుతుందన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడి గ్రాఫ్ మారలేదు. అంతేకాదు, వరుస ఆఫర్లతో ముందుకెళ్తున్నాడు.

లవ్ గురూగా మారిన టాప్ యాంకర్

లవ్ గురూగా మారిన టాప్ యాంకర్

బుల్లితెరపై సత్తా చాటిన ప్రదీప్... సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతడు.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురూగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాట హిట్ అయింది.

ప్రదీప్ సింగిల్ కాదంటూ రూమర్లు

ప్రదీప్ సింగిల్ కాదంటూ రూమర్లు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రదీప్.. తాను సింగిల్‌గానే ఉన్నానని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయితే, అతడి కెరీర్ దృష్ట్యా ఇప్పటికే పలువురితో లవ్ ట్రాక్ నడిపినట్లు రూమర్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘ఢీ' షో జడ్జ్, ప్రముఖ హీరోయిన్ పూర్ణతో ప్రదీప్ ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. దీంతో మనోడు మరింత హాట్ టాపిక్ అవుతున్నాడు.

సింగర్‌తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్

సింగర్‌తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్

ఇప్పటి వరకు ఈటీవీలోని షోలు మాత్రమే చేస్తున్న ప్రదీప్... మరోసారి సొంతగూటికి (జీ తెలుగు) వెళ్లాడు. ఇండస్ట్రీలోకి నేటి తరం సింగర్లను పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఆ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్'కు హోస్ట్‌గా చేస్తున్నాడు. ఈ షోలో భాగంగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఓ సింగర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చాడు.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
చెప్పండి... బిజీగా ఉండి చూడలేదు

చెప్పండి... బిజీగా ఉండి చూడలేదు

ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ప్రదీప్... ఓ లేడీ సింగర్‌ను అలా చూస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘ఏమైంది చెప్పండి.. చెప్పండి' అంటూ ప్రశ్నించింది. దీనికి ‘పోయిన వారం బిజీగా ఉండి చూడలేదు' అంటూ తనలోని రొమాంటిక్‌ యాంగిల్ చూపించాడు. దీంతో షాకైన ఆ అమ్మాయి అలా చూస్తూ సిగ్గు పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X