యాంకర్ ప్రదీప్‌ను ముద్దులతో చంపేశారు.. సుడిగాలి సుధీర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు!
ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే రియాలిటీ షోలో యాంకర్ ప్రదీప్, జబర్దస్త్ సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో కామెడీ ఆకట్టుకొనేలా ఉంటుంది. వారికి రష్మి గౌతమ్ తోడైతే ఆ ఎపిసోడ్ మరీ రంజుగా ఉంటుంది. తాజాగా ఈటీవీలో ఓ ఎపిసోడ్‌లో చేసిన అల్లరి పొట్టచెక్కలయ్యేంతంగా వినోదాన్ని పంచింది. జబర్దస్త్ తరహాలో ఆడవేషంలో ఉన్న మగ డాన్సర్లు ప్రదీప్, సుడిగాలి సుధీర్‌ను ముద్దులతో ముంచెత్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాహుబలిలో మనోహరి పాటకు
బాహుబలి చిత్రంలోని మనోహరి పాటకు డ్యాన్స్ షోలో ఆడిపాడారు. తెర మీద చూసిన దానికంటే బుల్లితెర మీద అద్భుతంగా థీమ్‌ను పండించారు. హోస్ట్‌లుగా ఉన్న శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రియమణి, కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ డ్యాన్సర్లను ప్రశంసలతో ముంచెత్తారు. అద్భుతంగా డ్యాన్స్ చేసిన వారిని సుధీర్, ప్రదీప్ వేదిక మీదకు పిలిచారు.

డ్యాన్సర్లతో సుడిగాలి సుధీర్
వేదికపైకి వచ్చిన ముగ్గురు ఆడవేషంలో ఉన్న డ్యాన్సర్లతో సుధీర్ ముందుగా అదే పాటకు డ్యాన్స్ చేశాడు. ఓ దశలో సుధీర్ ఆటపట్టించడానికి అతడిపై పడిపోయారు. ముద్దులతో శ్వాస తీసుకోలేనంతగా సుధీర్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. దాంతో సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు.

ముగ్గురితో కలిసి యాంకర్ ప్రదీప్
ఇక తర్వాత వంతు యాంకర్ ప్రదీప్ వంతైంది. ముగ్గురితో కలిసి ప్రదీప్ డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తుండగానే లైట్లు ఆఫ్ చేసి ప్రదీప్‌ను ముగ్గురు కలిపి వాటేసుకొన్నారు. చీకట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చివరకు ప్రదీప్‌ను వదిలేసి ముగ్గురు బయటకు వచ్చారు.

శేఖర్ మాస్టర్‌ను చూసి
హోస్ట్ స్థానంలో పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్‌ను చూసి పురుషులు అంటూ ముగ్గురు డ్యాన్సర్లు సిగ్గుపడిపోయారు. అలా ఆట పట్టిస్తూ కార్యక్రమం సరదాగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రపంచ రికార్డు సొంతం చేసుకొన్న గణేష్ మాస్టర్‌కు సన్మానం చేయమని శేఖర్ మాస్టర్ కోరాడు.

ముగ్గురు డ్యాన్సర్లతో మనోహరి
శేఖర్ మాస్టర్ సూచన మేరకు గణేష్ మాస్టర్ ఆ ముగ్గురు డ్యాన్సర్లతో మనోహరి పాటకు స్టెప్పులేసి ఇరుగదీశాడు. ముగ్గురితో డ్యాన్స్ చేస్తే.. ముగ్గురు కత్రినాలతో డ్యాన్స్ చేసినట్టు ఉందని గణేష్ మాస్టర్ కితాబిచ్చారు. అలా అల్లరిగా, సరదాగా ఆ ఎపిసోడ్ సాగిపొయింది. ప్రస్తుతం ఆ వీడియో ప్రోమో యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











