హీరోలను టార్గెట్ చేస్తున్నాడు(వీడియో)
హైదరాబాద్ : జీ తెలుగు ఛానల్‌లో ‘గడసరి అత్త సొగసరి కోడలు' కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా ప్రదీప్ పరిచితుడే. అలాగే ఆ తర్వాత ఆయన నేతృత్వంలో అనేక మంది నటీనటులతో రూపొందిన ప్రదీప్‌దర్బార్ సైతం సూపర్ హిట్టైంది. అల్లరితో వినోదంతో పలు అంశాలను రూపొందించటం ప్రదీప్ దిట్ట. ప్రస్తుతం ప్రదీప్ మరో టాక్ షో ప్లాన్ చేస్తున్నాడు. ఆ షో పేరు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఈ షో లో తెలుగు హీరోలు, హీరోయిన్స్ కు చెందిన విషయాలు, వారితో ఇంటర్వూలు ఉండనున్నాయి అని తెలుస్తోంది. ఈ షో కు చెందిన ప్రోమో చూడండి
ఈ షో ..తెలుగు చిత్ర పరిశ్రమలోని సెలబ్రెటీలతో సాగుతుంది. ఈ మధ్యనే ఈ షో కు సంభందించిన ప్రోమో జీ టీవి వారు విడుదల చేసారు. అనేకమైన టాక్ షోలు చూసినవారికి ఈ షో సరికొత్తగా ఉంటుందని, జీ తెలుగు ప్రతినిధి తెలిపారు.

ప్రదీప్ మాట్లాడుతూ... " మనకు మన జీవితంలో అనేక కలలు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి తీరినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. అదే విధంగా సినీ సెలబ్రెటీలకు సైతం అలాంటి తీరని కోరికలు అనేకం ఉంటాయి. ఈ షో లో అవి తీరినప్పుడు వాళ్లు ఎలా రియాక్టు అవుతాం అనేది చూపుతాం ," అన్నారు.


Click it and Unblock the Notifications











