హాట్ షోతో యాంకర్ మంజూష కవ్వింపులు.. చెప్పలేని చోట పుట్టుమచ్చ చూపిస్తూ..!

టాలీవుడ్‌లో ఉన్న టాప్ యాంకర్‌లో మంజూష కూడా ఒకరు. చలాకీగా , సరదాగా ఉండే మంజూష స్టార్‌గా దూసుకెళ్తున్నారు. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందాలతో బోల్డ్ లుక్స్‌లో హల్ చల్ చేస్తుంటారు మంజూష. యాంకర్‌గా కంటే ముందు కొన్ని సినిమాల్లోనూ సత్తా చాటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చి రాఖీలో హీరోకి చెల్లెలిగా కనిపించారు. నిజానికి ఆమె లక్ష్యం హీరోయిన్ కావడమే .. కానీ విధి మంజూషను యాంకరింగ్ వైపు నడిపించింది.

కుచ్చి కుచ్చి కూనమ్మ అనే చిత్రంలో తొలుత చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మంజూష.. ఆ తర్వాత తన ఫోకస్ చదువుపై పెట్టిన ఆమె అనంతరం మోడల్‌గా మారింది. పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజూష. అనంతరం బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆశల పల్లకి, అహల్య, చక్రవాకం వంటి సీరియల్స్‌లో కూడా ఆమె నటించారు. బుల్లితెరపై బిజీ అవుతుంది అనుకుంటున్న దశలో అనుకోకుండా మళ్లీ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు మంజూష.

Anchor Rampalli Manjusha Latest stunning Photos goes viral

టెలివిజన్ రంగంలో కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే ఓంకారం అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఏకంగా ఎన్టీఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు. అదే రాఖీ. ఈ సినిమాలో హీరోకి చెల్లెలిగా ఏడిపించిన మంజూష మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అత్తారింటిలో వేధింపులను ఎదుర్కొనే చెల్లెలిగా, చివరికి వారి చేతిల్లోనే చనిపోయి కంటతడి పెట్టించింది. అంతటి బలమైన పాత్రలో నటించడంతో మంజూష కెరీర్ ఊపందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మంజూష కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది.

యాంకరింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఈమె బాగా బిజీ అయ్యింది. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ హల్ చల్ చేసింది. అలా రికార్డు స్థాయిలో ఏకంగా 5000కు పైగా ఇంటర్వ్యూలు , సినిమా ఈవెంట్లను హోస్ట్ చేసి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 30 ప్లస్‌ను ఎప్పుడో క్రాస్ చేసిన మంజూష ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తడం లేదు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు ఫేడ్ అవుట్ కావడమో లేదంటే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడటమో చేస్తుంటే ఈమె మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ పెట్టలేదు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంజూష ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఈవెంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎదపై పుట్టుమచ్చ చూపిస్తూ బోల్డ్ షోతో రెచ్చగొడుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ కావాల్సిన వాళ్లు యాంకర్ ఎందుకయ్యారు మేడమ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం వైరల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: anchor manjusha movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X