twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకప్పుడు జాకెట్ ధరించేవారు కాదు... బ్లౌజ్ లెస్ సారీ వివాదానికి యాంకర్ రష్మి సపోర్ట్!

    |

    అమెరికాకు చెందిన 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ ఫోటో షూట్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చీరకట్టు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ఆమె ఫోజులు ఇవ్వడంతో 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీకట్టును అవహేళన చేస్తున్నావు' అంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.

    అయితే ఈ వివాదంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ఫోటో షూట్లో వల్గారిటీ ఏమీ లేదని, ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని కొందరు వాదిస్తుండగా, మన కల్చర్ తప్పుతోవ పట్టిస్తున్నారంటూ మరికొందరు సాంప్రదాయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పురాతన భారతంలో బ్లౌజ్ లెస్ సారీ ధరించేవారు

    పురాతన భారతంలో బ్లౌజ్ లెస్ సారీ ధరించేవారు

    ప్రియాంక ఫోటో షూట్ మీద ఇంటర్నెట్లో జరుగుతున్న రాద్దాంపై... ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలవరించింది. పురాతన భారతంలో రవికె(బ్లౌజ్) లేకుండానే చీర ధరించేవారు. తర్వాత క్రమక్రమంగా రవికె ధరించడం వాడుకలోకి వచ్చింది. ప్రియాంక చోప్రా ఫోటో షూట్ మీద అంతరాద్దాం చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ తన కథనంలో పేర్కొంది.

    యాంకర్ రష్మి సపోర్ట్

    యాంకర్ రష్మి సపోర్ట్

    ప్రియాంక చోప్రాకు సపోర్టుగా వచ్చిన ఈ కథనం యాంకర్ రష్మి కి చాలా నచ్చింది. దాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇలా చేయడం ద్వారా మహిళల వస్త్రధారణపై ఎవరికీ ఎలాంటి కామెంట్స్ చేసే హక్కు లేదు అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు రష్మి.

    యాంకర్ రష్మి స్త్రీవాదం

    యాంకర్ రష్మి స్త్రీవాదం

    యాంకర్ రష్మి స్త్రీవాది అనే సంగతి తెలిసిందే. పురషాధిక్య సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దారుణలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తుంటారు. చాలా విషయాల్లో ఆమె పలువురు నెటిన్లతో వాదోపవాదలు చేసిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా ఇష్యూపై కూడా స్పందించారు.

    మీ అభిప్రాయం ఏమిటి?

    మీ అభిప్రాయం ఏమిటి?

    ప్రియాంక చోప్రా బ్లౌజ్ లెస్ చీరకట్టు విషయంలో జరుగుతున్న వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? పురాతన భారతంలో జాకెట్ ధరించేవారు కాదు... ఈ విషయంలో ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏమిటనే రష్మి వాదనపై మీరు ఏకీభవిస్తారా? కామెంట్ బాక్సులో మీ అభిప్రాయాలు వెల్లడింండి

    English summary
    "Did you know women used to wear blouse-less saree in the pre-colonial India? Then why troll Priyanka chopra for this!? Indeed, angrez toh chale gaye, par trolls chod gaye." Anchor Rashmi retweeted news18 post.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X