twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరోను కించ పరచలేదు, ఎంత మంది సానిటరీ నాప్కిన్లు పంచుతున్నారు: యాంకర్ రష్మి

    |

    ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ మాదిరిగా.... తాజాగా 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు హాలీవుడ్ స్టార్లతో పాటు ఇండియన్ స్టార్స్ అక్షయ్ కుమార్, అర్జున్ సార్జా తదితరులు ఈ ఛాలెంజ్ పూర్తి చేసి ఔరా అనిపించారు. తమ స్టంట్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంలో భాగంగానే ఈ ఛాలెంజ్ తెరపైకి వచ్చింది. అభిమానులు సైతం దీన్ని సవాల్‌గా స్వీకరిస్తూ వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌పై యాంకర్ రష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రష్మిని టార్గెట్ చేస్తూ పలువురు నెటిజన్లు విరుచుకపడ్డారు.

    రష్మి చేసిన ట్వీట్ ఇదే

    రష్మి చేసిన ట్వీట్ ఇదే

    ‘బాటిల్‌ క్యాప్ ఛాలెంజ్‌.. నిజంగా దీన్ని అంత సీరియస్‌గా తీసుకుంటున్నారా. ఇలాంటివి చేసేవాళ్లకి పనీపాటా ఉండదు. అనవసర ఛాలెంజెస్ చేయడం కంటే ఏదైనా పనికొచ్చే పనులు చేయడం మంచిది. ఇలా సోషల్ మీడియాలో విషయాలు కాకుండా రియల్ లైఫ్‌లో విషయాలపై ఫోకస్ పెట్టండి' అంటూ రష్మి ట్వీట్ చేశారు.

    నాకు అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది

    నాకు అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది

    బాటిల్‌ క్యాప్ ఛాలెంజ్ మీద రష్మి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి... ఆమెపై జనాలు విమర్శలు చేయడం మొదలుపెడతారు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా... రష్మి స్పందిస్తూ ‘నాకు నా అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. మీకు ఇష్టమైతే స్వీకరించండి లేకుంటే వదిలేయండి. నేను మోబ్(జనం) మెంటాలిటీకి ఎఫెక్ట్ అయ్యే వ్యక్తిని కాదు.' అని స్పష్టం చేశారు.

    నేను ఏ హీరోను ట్యాగ్ చేసి కించ పరచలేదు

    నేను ఏ హీరోను ట్యాగ్ చేసి కించ పరచలేదు

    ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అంశంపై నేను చేసిన కామెంట్స్ ఎవరినీ ఉద్దేశించి చేయలేదు. ఏ సెలబ్రిటీని కించ పరిచే ఉద్దేశ్యం నాకు లేదు, ఎవరినీ ట్యాగ్ చేయలేదని రష్మి స్పష్టం చేశారు. ఇలాంటి ఛాలెంజెస్ చేసేపుడు పెద్ద పెద్ద స్టార్ల పేర్ల జనాలు వాడుకుంటున్నారు, కానీ వారు చేసే మంచి పనులను మాత్రం ఎవరూ ఫాలో అవ్వరని రష్మి వ్యాఖ్యానించారు.

    ఎంత మంది సానిటరీ నాప్కిన్లు పంచుతున్నారు?

    ఎంత మంది సానిటరీ నాప్కిన్లు పంచుతున్నారు?

    అక్షయ్ కుమార్ సర్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేయడం మాత్రమే కాదు... ‘పాడ్ మ్యాన్' సినిమా కూడా చేశారు. ఆ సినిమాలో చూపినట్లు మీలో ఎంత మంది సానిటరీ నాప్కిన్లు కొని ఈ సొసైటీలో పేదరికంలో ఉన్న అమ్మాయిలకు పంచడానికి సిద్దంగా ఉన్నారు. ఎంత మంది మహిళల రుతుస్రావం సమస్యలపై చైతన్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు... అంటూ రష్మి ప్రశ్నించారు.

    English summary
    " #bottletopchallenge #BottleCapChallege.. Seriously, How bloody jobless are people, If only they put all that energy into something constructive, Guys get a real life. And people who are taking big names with regard to the challenge kindly go thru the contribution they have made all the good work they have done which most of the followers don’t even bother picking a cue from. AK sir also made a movie called #padman. How many of u r willing to buy and distribute sanitary napkins to underprivileged girls near your society and spread awareness about menstural issues." Anchor Rashmi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X