యాంకర్ రష్మీకి చేదు అనుభవం.. ఆ పోర్న్ స్టార్ తో పోలుస్తూ ఘోరంగా!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. తనదైన శైలిలో హోస్టింగ్‌ చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీకి లవ్ ట్రాక్ నడుస్తోందన్న పుకార్లతో ఆమె మరింతగా పాపులర్ అయింది. బుల్లితెరపై సుధీర్-రష్మీ జోడికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.

ఇక వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తోంది. పలు షోలకు యాంకరింగ్ చేస్తున్న రష్మీకి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఒక పోర్న్ స్టార్ తో పోలుస్తూ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

యాంకర్ కన్నా ముందుగా..

యాంకర్ కన్నా ముందుగా..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు రష్మీ గౌతమ్. అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది.

అరకొర అవకాశాలతో..

అరకొర అవకాశాలతో..

సినిమాల్లో అరకొర అవకాశాలతో సాగిపోతోన్న రష్మీ గౌతమ్ కి బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కి యాంకర్‌గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. యాంకర్ గా రాణించడానికంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది.

ఒక్క సినిమా మాత్రమే..

ఒక్క సినిమా మాత్రమే..

బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుంటూరు టాకీస్'. ఈ ఒక్క సినిమా మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్రంలో డీజే టిల్లుగాపేరొందిన సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అలాగే మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత రష్మీ గౌతమ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు.

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..

లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో.. సినిమాలను ఆచితూచి అడుగులేస్తూ సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది యాంకర్ రష్మీ గౌతమ్. ఇందులో భాగంగానే ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ పెడుతోంది.

వాళ్లు వెళ్లిపోవడంతో..

సినిమాలతో తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ పర్సనల్ ట్రిప్‌లకు కూడా వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది ఇటీవల మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లింది. ఈ టూర్ లో బికినీ ధరించి మరి హాట్ షో చేసింది గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్, అనసూయ వెళ్లిపోవడంతో రష్మీ గౌతమ్ ఇటీవలే 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు కూడా యాంకర్‌గా మారింది.

స్కూల్ డేస్ బాగుంటాయి..

స్కూల్ డేస్ బాగుంటాయి..

శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ పూర్తి ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది. అయితే ఈ ప్రోమోలోదేవుడిని ప్రార్థించగా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బాల్యంలోకి వెళ్లాలనుకుంటున్నామని అటో రామ్ ప్రసాద్ అంటాడు. కొత్త సంవత్సరం ఎవరైనా ముందుకు వెళ్లాలనుకుంటారు. మీరేంటి వెనక్కి వెళ్లాలనుకుంటున్నారు అని దేవుడు అంటే స్కూల్ డేస్ చాలా బాగుంటాయని అటో రామ్ ప్రసాద్ అంటాడు.

మియా ఖలీఫాలా రష్మీ..

మియా ఖలీఫాలా రష్మీ..

దేవుడు తధాస్తు అని ప్రసాదించగా.. అటో రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్ రష్మీకి స్కూల్ యూనిఫామ్ డ్రెస్ లు ఒంటిపైకి వస్తాయి. అప్పుడే రష్మీని చూసి ఎక్కడో చూసినట్లుంది అని ఇమ్మాన్యుయెల్ అంటే.. అరెయ్ చూల్లేదా.. మియా ఖలీఫా అని పోర్న్ స్టార్ తో పోలుస్తాడు అటో రామ్ ప్రసాద్. అప్పుడు రష్మీ స్పెక్ట్స్ పెట్టుకుని అలాగే ఉంటుంది. ఇలా పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో యాంకర్ రష్మీని పోల్చి అవమానించారని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X