ఆమెను తల్లిని చేసిన హైపర్ ఆది.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన ఫోన్
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు వెలుగులోకి రావడంతో పాటు తమదైన టాలెంట్లతో సత్తా చాటుతున్నారు. అందులో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు.
అదిరిపోయే టైమింగ్‌తో పాటు ఆకట్టుకునే పంచులతో ఫేమస్ అయిన అతడు.. ఇప్పుడు అస్సలు తీరిక లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇలా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది తనను తల్లిని చేశాడంటూ ఒకరు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

జబర్థస్త్‌తో ఆది సెన్సేషన్
జబర్ధస్త్ షోలోకి ఎంతో మంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరే ఆరంభంలోనే సత్తా చాటి సెన్సేషన్ అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు హైపర్ ఆదిదే. అంతలా అతడు పంచులు, ప్రాసలతో మెప్పించాడు. దీనికితోడు కామెడీ స్కిట్లతో నవ్వించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తద్వారా బుల్లితెరపై హైపర్ ఆది స్టార్‌గా మారిపోయాడు.
వరుసగా మూవీలూ చేస్తూ
సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై నెంబర్ వన్ కమెడియన్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేయడంతో పాటు 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు వరుసగా మూవీలు చేస్తున్నాడు.

ఆ షోలలో మాత్రమే బిజీ
తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా వరుసగా ఫర్లను అందుకుంటోన్న హైపర్ ఆది జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అయ్యాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ ఇచ్చేశాడు. అలా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌కు అతడు దూరం అయ్యాడు. కానీ, 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ రెండు షోలలోనే ఆది తనదైన మార్కును చూపిస్తున్నాడు.
హోళీ సంబరాల్లో ఆది
చాలా కాలంగా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్నాడు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ హోళీ పండుగ స్పెషల్‌గా రూపొందింది. ఇందులో ఎన్నో ఫన్నీ, రొమాంటిక్, ఫైరింగ్ పెర్ఫార్మెన్స్‌లు చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ వాళ్లు తాజాగా విడుదల చేశారు.

గూగుల్ షాకిచ్చిందిగా
వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ప్రోమోలో హైపర్ ఆది తనదైన కామెడీతో అలరించాడు. ముఖ్యంగా కొందరిపై దిమ్మతిరిగే పంచులు వేశాడు. ఆ తర్వాత యాంకర్ రష్మీ 'ప్రతి ఒక్కరి గురించి గూగుల్ ఎలాంటి సమాచారం ఇస్తుందో చూద్దాం' అని చెప్పింది. ఆ వెంటనే హైపర్ ఆది గురించి గూగుల్ దిమ్మతిరిగే మేటర్ చెప్పింది.
తల్లిని చేసింది ఆదియే
హైపర్ ఆది గురించి రష్మీ అడిగిన ప్రశ్నకు గూగుల్ తల్లి 'అందరూ నన్ను గూగుల్ తల్లి అంటుంటారు కదా. నన్ను తల్లిని చేసిందే వాడు' అంటూ షాకిచ్చింది. దీంతో అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ వెంటనే రష్మీ 'గూగుల్ తల్లినే తల్లిని చేశారా' అని ప్రశ్నించగా హైపర్ ఆది 'అప్పుడు నేను తిరిగే వాడు అలాగే ఉండేవాడు మీవాడే (సుధీర్)' అంటూ పంచ్ వేశాడు. మొత్తానికి ఆదిపై చేసిన ఈ ఫన్ బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











