For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మీకి చేదు అనుభవం.. మాల్ ఓపెనింగ్‌‌కని వెళ్తే అరాచకం.. మీదకు దూసుకెళ్లి అలా?

  |

  బుల్లితెర యాంకర్స్ లో రష్మీకి సపరేట్ క్రేజ్ ఉంది.. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఆమె విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది.. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ తో ఉన్న కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ కావడంతో ఇద్దరికీ మరిన్ని షోలు కూడా లభిస్తున్నాయి. అడపా దడపా కొన్ని సినిమాలు కూడా చేస్తూ ఉండే రష్మీకి తాజాగా చేదు అనుభవం ఎదురయింది ఆ వివరాల్లోకి వెళితే.

   మంచి ఆదాయంగా మారడంతో

  మంచి ఆదాయంగా మారడంతో

  ఈ మధ్యకాలంలో నటీనటులకు, యాంకర్లకు షాపు ఓపెనింగ్ లు మంచి లాభసాటిగా మారాయి.. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న తమ నూతన వ్యాపార సంస్థల ఓపెనింగ్ సందర్భంగా హీరోయిన్లను యాంకర్లను తీసుకువెళ్లి అక్కడ షాప్ ఓపెనింగ్ చేయించడం ఆనవాయితీగా మారింది. ఆదాయం బాగా వస్తూ ఉండటంతో హీరోయిన్లు, యాంకర్ లు ఈ అంశం మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా అలా వెళ్లి రష్మీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.

  తీవ్ర గందరగోళ పరిస్థితి

  తీవ్ర గందరగోళ పరిస్థితి

  ఒక షాపు ఓపెనింగ్ నిమిత్తం చిత్తూరు వెళ్ళిన రష్మి అక్కడ తన అభిమానుల కారణంగా ఇబ్బందులు పడింది. అసలు ఏమైంది అంటే సోమవారం నాడు చిత్తూరు నగరంలో యాంకర్ రష్మి సందడి చేశారు. చిత్తూరు చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటుచేసిన సంస్కృతి షాపింగ్ మాల్‌ ను యాంకర్ రష్మి ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంకు విచ్చేసిన రష్మీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం చర్చి వీధికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం రద్దీగా‌ మారిపోయింది.

  రష్మీని తాకేందుకు

  రష్మీని తాకేందుకు

  తమ అభిమాన యాంకర్ రష్మీతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడడంతో వారిని అదుపుచేయడం షాపింగ్ మాల్ సిబ్బంది వల్ల కాలేదు. సిబ్బంది చేతులు ఎత్తేయడంతో అక్కడ తోపులాట జరిగి, అరుపులు కేకలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఐదే అదునుగా కొంత మంది ఆకతాయిలు రష్మి మీదికి దూసుకుని వచ్చారు. ఆమెను తాకేందుకు కూడా ప్రయత్నించారు. ఆ జనం మధ్యలోనే ఇరుక్కుపోయింది రష్మి. అయితే సాధరణంగాకొంచెం తేడా జరిగితే సెలబ్రిటీలు సైతం సంయమనం కోల్పోతారు. కానీ ఇంత జరుగుతున్నా రష్మి ఎక్కడా అసహనానికి గురికాకపోవడం గమనార్హం. నవ్వుతూనే అభిమానులకు సర్ది చెప్పింది రష్మీ.

   రిబ్బన్ కట్ చేయకుండానే

  రిబ్బన్ కట్ చేయకుండానే

  ఇక తీవ్ర గందరగోళ పరిస్థితిలో రిబ్బన్ కూడా కట్ చేయడం రష్మీకి వీలుపడలేదు. అలా జనం తోపులాట మధ్య నుంచే షాపింగ్ మాల్‌లోకి అడుగు పెట్టిన రష్మి.. జ్యోతి ప్రజ్వలన చేసి షాప్ ను ప్రారంభించారు. ఆ తరవాత షాపింగ్ మాల్ స్టాఫ్‌తో ఆమె ఫొటోలు దిగారు.. షాప్‌లోని చీరలను కొన్నింటిని ప్రదర్శించారు.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Siri ఫ్యూచర్ Shannu చేతిలో.. పాపం Lobo || Filmibeat Telugu
  ఏమైనా అయ్యుంటే?

  ఏమైనా అయ్యుంటే?

  అయితే, ఈ తోపులాట, గందరగోళ పరిస్థితి రష్మి క్రేజ్‌ కు అద్దం పడుతున్నా ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపింగ్ మాల్ యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సందర్భాలలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా సెక్యూరిటీ తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు?

  English summary
  anchor Rashmi Faced a bitter experience at shopping mall opening in Chittoor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X