twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదేమీ సాధారణ ఘటన కాదు.. అందరూ గళమెత్తాలి.. యాంకర్ రష్మీ ఫైర్

    |

    జబర్దస్త్ యాంకర్ రష్మీ బుల్లితెర, వెండితెరపై ఎంతోమంది అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. జబర్దస్త్, ఢీ, స్పెషల్ ఈవెంట్స్ అంటూ బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతోంది. యాంకరింగ్ గ్లామర్‌ను అద్దినవారిలో రష్మీ కూడా ఒకరు. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించిన రష్మీ.. జబర్దస్త్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది. అయితే బుల్లితెరపై సంపాధించినంత క్రేజ్ వెండితెరపై సాధించలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ.. సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది.

    మూగజీవాల తరుపున..

    మూగజీవాల తరుపున..

    రష్మీకి మూగజీవాల పట్ల అంతులేని ప్రేమ ఉంటుంది. నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మూగజీవాలకు ఎవరైనా హాని చేశారని తన దృష్టికి తీసుకొస్తే.. ట్వీట్ల ద్వారా స్పందిస్తుంది. కుక్కలు, ఆవులు వంటివాటిపై దయచూపండని అందరినీ కోరుతుంది.

     కరోనా సమయంలో మరింత సేవ..

    కరోనా సమయంలో మరింత సేవ..

    ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే లక్ష కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో మూగజీవాలకు ఆహారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి.. కుక్కలకు స్వయంగా ఆహారాన్ని అందించింది.

    తాజాగా ఓ ఘటన..

    తాజాగా ఓ ఘటన..

    తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్‌లో 6 ఏళ్ల బాలికతో పని చేయించారు. వాచ్‌మెన్ కూతురు అలా పని చేస్తుండగా.. పక్కనే ఉన్న పోలీసులు ఆపకపోగా.. అది చెయ్ ఇది చెయ్ అని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.

    Recommended Video

    #HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
    ఇదేమీ సాధారణ ఘటన కాదు..

    ఇదేమీ సాధారణ ఘటన కాదు..

    ఈ ఘటనపై యాంకర్ రష్మి స్పందించింది. ఈ ఘటనను ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది. ఇదంతా సర్వసాధారణమని, విద్యార్థలు స్కూళ్లలో పని చేస్తారని, తాను కూడా చిన్నప్పుడు పని చేశానని, విదేశాల్లోనూ అలాగే చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ప్రతిస్పందనగా రష్మీ.. అయితే విద్యార్థులు చేయాలి గాని వాచ్‌మెన్ కూతురు కాదని కౌంటర్ ఇచ్చింది.

    English summary
    Anchor Rashmi Fires On Child labour who is Cleaned Classroom. She Says That This is not normal and shud not be considered normal pls raise your voice if you see such a thing happening
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X