twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారు కూడా అనుభవిస్తారు.. అలాంటి వారికి మరణశిక్ష వేసినా తక్కువే.. యాంకర్ రష్మీ ఫైర్

    |

    జబర్దస్త్ యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. యాంకరింగ్‌లో కొత్త పద్దతిని, గ్లామర్‌ను యాడ్ చేసింది రష్మీ. ఇలా బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌.. వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే బుల్లితెరపై వచ్చిన క్రేజ్.. వెండితెరపై రాబట్టుకోలేకపోయింది. చేసిన ఏ ఒక్క సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ప్రతీసారి ఒకే రకమైన పాత్రలు, కేవలం స్కిన్ షోకు పరిమితం కావడంతో అక్కడ విఫలమైంది. అవన్నీ కాసేపు పక్కన బెడితే.. సోషల్ మీడియాలో రష్మీ యాక్టివ్‌గా ఉంటూ సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది.

    మూగజీవాల కోసం తపన..

    మూగజీవాల కోసం తపన..

    రష్మీకి మూగజీవాలంటే మక్కువ ఎక్కువ. వీధి కుక్కలపైనా అమితమైన ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మూగజీవాలకు ఎవరైనా హాని చేశారని తన దృష్టికి తీసుకొస్తే.. ట్వీట్ల ద్వారా స్పందిస్తుంది. ఈ మధ్య టిక్ టాక్‌లో మూగజీవాలను హింసించడం జరుగుతూ వస్తోంది. వాటిపైనా రష్మీ గతంలో గళమెత్తింది.

    మూగజీవాలకు ఆహారం..

    మూగజీవాలకు ఆహారం..

    ప్రస్తుతం కరోనా వైరస్ మూగజీవాలకు ఆహారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి.. కుక్కలకు స్వయంగా ఆహారాన్ని అందించింది. స్వచ్చంద సంస్థలతో కలిసి.. మూగజీవాలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాలు చేపట్టింది. ఎక్కడైనా వాటికి ఆహారం లభించడం లేదని తెలియజేస్తే... అక్కడికి ఆహారాన్ని పంపే ప్రయత్నం చేస్తుంది.

    ఇదేమీ సాధారణ ఘటన కాదు..

    ఇదేమీ సాధారణ ఘటన కాదు..

    తాజాగా ఓ బాల కార్మిక ఘటనపై యాంకర్ రష్మి స్పందించింది. నెల్లూరులోని ఓ స్కూల్‌లో వాచ్ మెన్ తన కూతురితో క్లాస్ రూమ్‌ను శుభ్రం చేయించిన ఘటనపై స్పందిస్తూ.. దీనిని ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది. తాజాగా టిక్‌టాక్ వీడియోలో హింస పెరిగిపోవడంతో రష్మీ అసహనం వ్యక్తం చేస్తోంది.

    టిక్‌టాక్‌లో హింసను ప్రేరేపించడం..

    టిక్‌టాక్‌లో హింసను ప్రేరేపించడం..

    టిక్‌టాక్‌లో ఈ మధ్య పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. మూగజీవాలను హింసిస్తున్నారు. కుక్క కాళ్లను కట్టేసి.. చెరువులో పడేశారు కొందరు ఆకతాయిలు. ఈ ఘటనపై రష్మీ స్పందిస్తూ.. ఆ వీడియోలు ఉన్నవారంతా.. వారిని అలా పెంచిన తల్లిదండ్రులు కూడా అంతకంతా అనుభవిస్తారు.. వీరికి మరణ శిక్ష విధించినా తక్కువే అవుతుందని అసహనం వ్యక్తం చేసింది.

    English summary
    Anchor Rashmi Fires On Tiktok Vidoes. She Says That All I hope is the people who are part of this video and the parents who gave such a shitty upbringing to these shitty humans may suffer the same and even worstDeath punishment for them
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X