Rashmi Gautam: మొబైల్ నెంబర్ షేర్ చేసిన రష్మీ గౌతమ్.. ఫోన్ చేయండి అంటూ పోస్ట్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని గ్లామరస్ యాంకరమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెరపై అనేక షోలకు గ్లామర్ టచ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఘాటు సన్నివేశాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో దూసుకుపోతున్న ఈ వయ్యారి తాజాగా మొబైల్ నెంబర్ షేర్ చేసింది. అవసరం ఉంటే కాల్ చేయమని కూడా చెబుతుంది. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందే పూర్తి కథనంలో తెలుసుకుందాం.

వైద్యం అందిస్తూ:అనేక షోలతో అట్రాక్ట్ చేసిన సుందరాంగీ యాంకర్ రష్మి పెట్ (యానిమల్) లవర్ అన్న విషయం తెలిసిందే. కుక్కలు, పిల్లులు ఇలా ఇతర జంతువుల బాధలను తన బాధగా ఫీల్ అవుతుంటుంది ఈ స్టన్నింగ్ సుందరి. అంతేకాకుండా పెట్స్ ఎక్కడైనా రోడ్డు పక్కన పడి ఉన్నా.. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చలించిపోతుంది. వాటిని కాపాడి హాస్పిటల్ లో చేర్పించి వైద్యం కూడా అందిస్తుంది.

Anchor Rashmi Gautam About Animal Rescue In Rainy Season

అలా పెంచుతూ:మూగ జీవాలపై అమానుషంగా ప్రవర్తించినావారిని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తుంది. వాళ్లకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తుంటుంది. అలాగే పలు సామాజిక అంశాలపై కూడా తన స్టైల్ లో స్పందిస్తుంటుంది. రోడ్డుపై కనిపించినా ఎన్నో జంతువులను రెస్క్యూ చేసిన యాంకర్ రష్మీ ఓ పెట్ ను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటోంది.

ట్రోలింగ్ కూడా:జంతువులపై ప్రేమ కురిపించే యాంకర్ రష్మీ గౌతమ్.. ఫారెన్ బ్రీడ్లను తెచ్చుకుని పెంచుకోకండని.. లోకల్ బ్రీడ్లను పెంచుకుని కాపాడాలంటూ పెట్ లవర్లకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక పెట్స్ గురించి రష్మీ పెట్టే పోస్టులు, కామెంట్స్ పై అప్పుడప్పుడు ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది.

Anchor Rashmi Gautam About Animal Rescue In Rainy Season

వరదలు వస్తున్నాయి:ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోని యాంకర్ రష్మీ పెట్స్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అలాగే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో జంతువుల గురించి ఆవేదన చెందుతూ పోస్ట్ పెట్టింది. "అసలే ఇప్పుడు వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వరదలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలిస్తుంటాయి. కాన జంతువుల గురించి అంతగా పట్టించుకోవు" అని ఓ వీడియోలో పేర్కొంది రష్మీ.

Anchor Rashmi Gautam About Animal Rescue In Rainy Season

ఫ్రీగా వదిలేయండి:"వరదల సమయంలో కుక్కలు, మేకలు, ఆవులు, గేదెలు, కోళ్ల ప్రాణాల గురించి ఎవరూ లెక్కచేయరు. ఇలాంటి సమయంలో జంతువుల గురించి కూడా కాస్తా ఆలోచించండి. అలా వదిలేయకండి. మీరు బయటకు వెళ్లే సమయంలో వాటిని కట్టేసి ఉంచకండి. ఒకవేళ వరదలు వస్తే వెళ్లేందుకు వాటికి దారి ఉండదు. అందుకే వాటిని ఫ్రీగా వదిలేయండి" అని యాంకర్ రష్మి వేడుకుంది.

Anchor Rashmi Gautam About Animal Rescue In Rainy Season

కాల్ చేయండి:ఇంకా కొనసాగించిన యాంకర్ రష్మి.. "మీకు ఎలాంటి సలహాలు, సాయం కావాలన్న రెస్క్యూ టీమ్ అందుబాటులో ఉంటుంది. వారి నెంబర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను" అంటూ 9697887888 అని ఓ నంబర్ ను చూపించింది. ఇలా జంతువుల ప్రాణాలను కాపాడమంటూ ఓ నెంబర్ ను షేర్ చేసి ఫోన్ చేయాల్సిందిగా చెప్పుకొచ్చింది రష్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X