Rashmi Gautam: ఆస్పత్రి బెడ్‌పై యాంకర్ రష్మీ.. ఫ్యాన్స్ షాక్ అసలేం జరిగిందంటే?
Rashmi Gautam: బుల్లితెరపై సక్సెస్ పుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు రష్మి గౌతమ్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు బుల్లి తెర, వెండి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై మకుటం లేని రాణిలో వెలిగిపోతుంది. టీవీ ఆన్ చేస్తే చాలు ఏదొక షోలో కనిపిస్తూ అల్లరి చేస్తునే ఉంటుంది. ఆమె హవా అంతా ఇంతా.. కాదు. ఆమె యాంకరింగ్ చేస్తే షోలు టాప్ రేటింగ్ లో దూసుకెళ్లాయి. తన అందం, అభినయంతో పాటు ముద్దు ముద్దు ఇంగ్లీష్ మిక్స్ డ్ తెలుగు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలా తనకంటూ.. ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మడు తాజాగా తాను ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
రష్మి ఒడిశా అయినా పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే. సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్ కు మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ.
అలా 2002లో 'సవ్వడి' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్న అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో బుల్లి తెరపై అడుగుపెట్టింది. తన అందంతో పాటు ముద్దు ముద్దు ఇంగ్లీష్ మిక్స్ డ్ తెలుగు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

రష్మి యాంకర్ గా, నటిగా రష్మీ గౌతమ్ రాణిస్తుంది. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తూ, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. రష్మి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్‌బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలా తనకంటూ.. ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. వెండి తెరపై గ్లామర్ షో తో రెచ్చిపోయిన ఈ అమ్మడికి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో ఈ హాట్ బ్యూటీ టీవీ షోలపై పుల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది.
ఓ వైపు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మి తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో తన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే రష్మి సర్జరీ చేయించుకోబోతుందట. తన భుజాన్ని ఆపరేషన్ జరుగబోతుందట. ఈ క్రమంలో ఓ ఫోటోను షేర్ చేసింది.

తనకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాననీ, తాను కొంతకాలం దానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలనని క్యాప్షన్ పెట్టింది. రష్మీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











