బికినీలో యాంకర్ రష్మీ అందాల ఆరబోత: నీళ్లలో తడిచి మరీ అలా చూపిస్తూ!

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది యాంకర్లు ఉన్నా.. అందులో ఒకరిద్దరు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ ద్వారా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్‌ను, ఆఫర్లను సొంతం చేసుకుంది. ఫలతంగా చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సుందరాంగి మాల్దీవ్స్ ట్రిప్‌లో దిగిన ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అలా వచ్చింది... ఇలా ఫేమస్

అలా వచ్చింది... ఇలా ఫేమస్

మోడల్‌గా సందడి చేస్తోన్న సమయంలోనే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి నటిగా అడుగు పెట్టింది. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలను పోషించింది. అలా చాలా కాలం పాటు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత 'జబర్ధస్త్' షో యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అంతే అప్పటి నుంచి ఈ అమ్మడు కెరీర్ దూసుకుపోతూనే ఉంది.

 లవ్ ట్రాక్‌తో మరింత గుర్తింపు

లవ్ ట్రాక్‌తో మరింత గుర్తింపు

జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కొంత కాలానికే రష్మీ గౌతమ్‌కు ఎనలేని గుర్తింపు దక్కింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. దీంతో ఎన్నో షోలలో భాగం అయింది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఫలితంగా ఈ బ్యూటీ అతడికి జోడీగా పేరు తెచ్చుకుంది.

ఎన్నో సినిమాలు.. బ్రేక్ లేదు

ఎన్నో సినిమాలు.. బ్రేక్ లేదు

సినిమా నటిగానే కెరీర్‌ను మొదలు పెట్టిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ పలు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చింది.

బ్లాక్ బస్టర్ అంటూ వచ్చింది

బ్లాక్ బస్టర్ అంటూ వచ్చింది

ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాల్లో నటించని రష్మీ గౌతమ్.. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ చేస్తూ మరిన్ని ఆఫర్లు అందుకుంటోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు, ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తన క్రేజ్ పెంచుకుంటోంది.

రష్మీ మాల్దీవ్స్ పిక్స్ వైరల్

రష్మీ మాల్దీవ్స్ పిక్స్ వైరల్

తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మాల్దీవ్స్ ట్రిప్‌లో భాగంగా బికినీ ధరించి అందాలను ఆరబోసింది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో యాంకర్ రష్మీ గౌతమ్ హాట్ షోకు చాలా మంది ఫిదా అయిపోతోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X