పెళ్లికి రెడీ అయిన రష్మీ గౌతమ్: ఇన్‌స్టాలో అలాంటి పోస్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఫ్యాన్స్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే రెండు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానం దక్కుతోంది. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ పెళ్లికి రెడీ అయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయింది

అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయింది

అప్పుడెప్పుడో రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది.

 అతడితో లవ్ ట్రాకు వల్ల మరింత ఫేమస్

అతడితో లవ్ ట్రాకు వల్ల మరింత ఫేమస్

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో రష్మీ గౌతమ్ మంచి గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

 హీరోయిన్‌గా ప్రయాణం... ఆ ఒక్కటి తప్ప

హీరోయిన్‌గా ప్రయాణం... ఆ ఒక్కటి తప్ప

ఆరంభం నుంచే ఎన్నో సినిమాల్లో మెప్పించిన రష్మీ గౌతమ్.. సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో లీడ్ రోల్ చేయడానికి ముందుకు రావట్లేదు.

 అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోందీ హాట్ యాంకర్.

 పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మీ గౌతమ్

పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మీ గౌతమ్


ప్రస్తుతం రష్మీ గౌతమ్ 'జబర్ధస్త్', 'ఢీ' షోలలో ఫుల్ టైమ్ మెంబర్‌గా చేస్తోంది. అదే సమయంలో కొన్ని స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. అలాగే, కొన్ని సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించేందుకు రెడీ అవుతోంది. ఇలా కెరీర్‌ను ఫుల్ బిజీగా ముందుకు తీసుకు వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లికి రెడీ అయినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
అలాంటి పోస్టు.. ఉలిక్కిపడిపోయిన ఫ్యాన్స్

అలాంటి పోస్టు.. ఉలిక్కిపడిపోయిన ఫ్యాన్స్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న ఫొటోలను స్టోరీగా పెట్టుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే దీన్ని షేర్ చేస్తూ వైరల్ చేసేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె జబర్ధస్త్ షో కోసం ఓ పెళ్లి స్కిట్ చేసింది. ఇది దానికి సంబంధించిన ఫొటోనే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X