సుడిగాలి సుధీర్‌ పేరు మార్చేసిన రష్మీ: వామ్మో మళ్లీ రెచ్చిపోయారుగా.. అలా పిలిస్తే తట్టుకోగలడా!

తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా జంటగా సందడి చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. వేరే వేరే టాలెంట్లతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు.. జబర్ధస్త్ షో ద్వారా జంటగా మారిపోయారు. దీంతో ఈ జోడీ పెళ్లి కూడా చేసుకోబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తరచూ వీళ్లిద్దరూ రొమాన్స్‌ను పండిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుడిగాలి సుధీర్ పేరును మార్చేసింది రష్మీ గౌతమ్. అంతేకాదు, అతడిని ప్రేమగా పిలుస్తూ రెచ్చిపోయింది. ఆ సంగతులు మీకోసం!

జబర్ధస్త్ ద్వారా కలిసిన రష్మీ సుధీర్

జబర్ధస్త్ ద్వారా కలిసిన రష్మీ సుధీర్

మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న చిన్న పాత్రలతో ఫేమస్ అయింది రష్మీ గౌతమ్. ఆ తర్వాత జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇక, మెజీషియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా మారిపోయాడు సుధీర్. ఇలా ఈ ఇద్దరూ ఆ షోలో కలుసుకున్నారు. అక్కడే పరిచయాన్ని పెంచుకున్నారు.

దానివల్లే లవ్ ట్రాక్ టాక్ మొదలైంది

దానివల్లే లవ్ ట్రాక్ టాక్ మొదలైంది

జబర్ధస్త్ షోలోని కమెడియన్లు అందరూ అందులో పని చేస్తున్న వారిపైనా పంచ్‌లు పేలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అలా అప్పట్లో సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్‌ను ఇంప్రెస్ చేసినట్లుగా డైలాగులు చెప్పేవాడు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ మొదలైంది. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు రావడంతో వీళ్లు జంటగా ఫేమస్ అయ్యారు.

ఖండిస్తునే కన్‌ఫ్యూజ్ చేస్తున్నారుగా

ఖండిస్తునే కన్‌ఫ్యూజ్ చేస్తున్నారుగా

దాదాపు ఏడేళ్లుగా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు వస్తున్నాయి. వీటిపై వీళ్లిద్దరూ ఎన్నోసార్లు స్పందించారు. ఈ క్రమంలోనే ఈ వార్తలను ఖండించారు. కానీ, ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ అందరినీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. దీంతో టాక్ నడుస్తూనే ఉంది.

క్యాష్ చేసుకుంటోన్న షో నిర్వహకులు

క్యాష్ చేసుకుంటోన్న షో నిర్వహకులు

బుల్లితెరపైన ఫేమస్ అయిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ విడివిడిగా కంటే జంటగానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వీళ్లిద్దరూ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ల పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు షోల నిర్వహకులు తరచూ వీళ్లతో డ్యాన్సులో, పాటలో, రొమాంటిక్ స్కిట్‌లో చేస్తున్నారు. తద్వారా రేటింగ్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

అక్కడ కూడా వీళ్లిద్దరిదే అసలైన రచ్చ

అక్కడ కూడా వీళ్లిద్దరిదే అసలైన రచ్చ

చాలా కాలంగా జబర్ధస్త్‌లో షోలో సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ సినిమాల్లోనూ సోలోగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక, అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఢీ' షోలోనూ ఈ జోడీ తెగ హల్‌చల్ చేస్తోంది. మెంటర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు మజాను పంచుతూ జంటగా దూసుకుపోతున్నారు.

సుడిగాలి సుధీర్ పేరు మార్చేసిన రష్మీ

సుడిగాలి సుధీర్ పేరు మార్చేసిన రష్మీ

సుడిగాలి సుధీర్‌తో ఉన్న బంధం గురించి ఎన్ని సార్లు అడిగినా.. రష్మీ గౌతమ్ స్పందన ఒకేలా ఉంటోంది. అతడితో అందరూ అనుకునేలా రిలేషన్ లేదని చెబుతోంది. అయినప్పటికీ షోల కోసం అతడితో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి పేరు మార్చేసింది.

అలా పిలుస్తూ... రెచ్చగొట్టిన యాంకర్

అలా పిలుస్తూ... రెచ్చగొట్టిన యాంకర్

వచ్చే వారం ప్రసారం కానున్న 'ఢీ 13' ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు 'సుడ్డీ' అనే పేరు పెడుతున్నట్లు చెప్పింది. ఆ తర్వాత రొమాంటిక్‌గా పలుమార్లు అతడిని పేరు పెట్టి పిలిచింది. అంతేకాదు, సుధీర్‌తో కలిసి ఓ లవ్ సాంగ్‌కు సైతం డ్యాన్స్ చేసింది. అతడు కూడా బాగానే రొమాన్స్ పండించాడు. దీంతో ఈ జంట మరోసారి హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X