సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్ క్లారిటీ.. 2020లో ప్లాన్ చేస్తే వర్కవుట్ కాలేదంటూ కామెంట్
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్లైన రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య అఫైర్ కొనసాగుతుందనే పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి అడ్డుకట్ట పడలేకపోయింది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్‌తో పెళ్లి విషయంపై రష్మీ గౌతమ్ మరోసారి క్లారిటీ ఇస్తూ..

సుధీర్‌తో కలిసి నటించేందుకు
బుల్లితెర మీద మాదిరిగానే వెండి తెర మీద కూడా సుధీర్, రష్మీ గౌతమ్ జంటగా నటించాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వస్తున్న విషయం నాకు తెలుసు. ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్ తగినట్టుగా నేను, సుధీర్‌తో కలిసి నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సరై కథల కోసం వెతుకుతున్నాం అని రష్మీ గౌతమ్ తెలిపారు.

సుధీర్‌తో అన్నిసార్లు కుదరదు
సుధీర్, నా కాంబినేషన్‌కు మంచి పాపులారిటీ ఉంది. మేము ఇక్కడ ఉంది కేవలం వినోదాన్ని అందించడానికే. అందుకోసం కలిసి పనిచేస్తాం. అన్నిసార్లు టీవీలో గానీ, సినిమాల్లో గానీ కలిసి పనిచేయడం కుదరదు. అలా మా కాంబినేషన్ సెట్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని రష్మీ గౌతమ్ పేర్కొన్నారు.

మా ఇద్దరి కాంబినేషన్‌లో
మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని మాకు బలమైన కోరిక ఉంది. సుధీర్ సినిమా రిలీజైతే నా గురించి అడుగుతున్నారు. నా సినిమా రిలీజ్ అయితే సుధీర్ గురించి అడుగుతున్నారు. అయితే మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని అనుకొంటున్నాం. నేను కథలు వింటున్నాను. సుధీర్ కథలు వింటున్నాడు. ఏం జరుగుతందో వేచి చూడాలి అని రష్మీ గౌతమ్ అన్నారు.

2021లో ఎలాంటి ప్లాన్స్ లేవు
సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నాకు కొత్త కాదు. నా పెళ్లి గురించే నేను ఆలోచించడం లేదు. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టిపెడుతున్నాను. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా విషయాల గురించి 2020లో ప్లాన్ చేసుకొంటే ఏం జరిగిందో అందరికి తెలిసిందే. 2021లో కూడా ఎలాంటి ప్లాన్స్ చేసుకోదలచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచన కూడా రావడం లేదు అని రష్మీ గౌతమ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Recommended Video

బొమ్మ బ్లాక్‌బస్టర్ మూవీతో రెడీ
ప్రస్తుతం ప్లాన్ చేసుకొంటే వర్కవుట్ కాదని తెలిసి పోయింది. బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. కానీ కరోనావైరస్ పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మా సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేదా ఓటీటీలో వస్తుందా అనే క్లారిటీ లేదు అని రష్మీ గౌతమ్ అన్నారు.


Click it and Unblock the Notifications











