Rashmi Gautam: రష్మికి అలాంటోడే కావాలట.. రోజూ అలా చేయాలట!.. ఇంతకీ అతడేనా?

రష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆమె జబర్ధస్త్ ప్రొగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు అయితే సాధించుకుంది. అయితే వెండితెరపై కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ.. అలరిస్తూ వస్తోన్న రష్మి.. తాజాగా తనకు కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

వెండితెరపై కూడా: యాంగర్ రష్మి.. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ రష్మి నటించి ప్రేక్షకులను అలరించింది. గుంటూరు టాకీస్ అంటూ అందులో అందాలను ఆరబోసింది. అయితే నటిగా అంతగా నిలదొక్కుకోలేకపోయింది. ఇక మరోవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో కనిపిస్తూ... ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తోంది.

Anchor Rashmi Gautam Comments on Her Future Husband News Viral in Social Media

అలాంటివాడే: ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో రష్మి తనకు కాబోయే వాడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు కాబోయే భర్తపై రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. అతడు చెప్పే మాటలు.. యాక్షన్స్​లో చేసి చూపించాలి, అతను చేసిన యాక్షన్​ మాటలతో సింక్ అవ్వాలి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Anchor Rashmi Gautam Comments on Her Future Husband News Viral in Social Media

వైరల్ గా కామెంట్స్: ఇక కొంతమంది ఇది కచ్చితంగా సుడిగారి సుధీర్ గురించే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సుడిగాలి సుధీర్ చెప్పిందే చేస్తాడు.. చేసేది చెప్తాడు అని... వీళ్లిద్దరూ జంట బాగుంటుందని అంటున్నారు. దీనితో రష్మి కామెంట్స్ వైరల్ గా మారాయి. రష్మి, సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ కోసం వీరి మధ్య లవ్ ట్రాక్ నడిపించారు.

Anchor Rashmi Gautam Comments on Her Future Husband News Viral in Social Media

అతడి కోసమే: ఇక ఈ షో కోసం కాదని.. నిజంగానే లవర్స్ అంటూ ప్రచారం అయితే జరిగింది. వీటిపై రష్మి, సుదీర్ కూడా గతంలో స్పందించారు కూడా. మేం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ నెటిజన్స్ మాత్రం వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఇక రష్మి మాటలతో మరోసారి వీరి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. రష్మి కామెంట్స్ సుధీర్ కోసమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Anchor Rashmi Gautam Comments on Her Future Husband News Viral in Social Media

భోళా శంకర్ సినిమాలో: ఇక రష్మి విషయానికి వస్తే.. బుల్లి తెరపై సందడి చేస్తూనే.. వెండితెరపై మెరిసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో రష్మి ఓ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాతో మరోసారి వెండితెరపై మెరవాలని ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X