Rashmi Gautam స్నేహితులతో నైట్ పార్టీ.. మందు గ్లాసులతో యాంకర్ రష్మీ రచ్చరచ్చ
గత కొన్నేళ్లుగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ చిన్నితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న రష్మీ గౌతమ్ తాజాగా తన స్నేహితులతో కలిసి చిల్ అయింది. బ్యాచ్ అంతా ఒక్కచోట చేరి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి సడెన్ షాకిచ్చింది యాంకర్ రష్మీ. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆదివారం రోజు రాత్రి రష్మీ తన ఫ్రెండ్స్‌ని కలిసినట్లు తెలుస్తోంది. నైట్ మొత్తం అంతా జాలీగా గడిపారట.

జబర్దస్త్ బ్యూటీగా రష్మీ క్రేజ్
జబర్దస్త్ కామెడీషోతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. కెమెరా ముందు గ్లామరస్ లుక్స్‌తో చిన్నితెర ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడికి పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం ముమ్మాటికీ జబర్దస్త్ ప్రోగ్రామే అని చెప్పుకోవడంలో అతిశయోక్తిలేదు. జబర్దస్త్ బ్యూటీగా రష్మీ క్రేజ్ అమాంతం పెరుగుతూ వస్తోంది.

చేతినిండా షోస్.. అదే ఆనవాయితీ
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మూడు షోస్ కూడా రష్మినే హ్యాండిల్ చేస్తోంది. రీసెంట్ గానే అనసూయ జబర్దస్త్ వీడటంతో ఆ బాధ్యతలు కూడా రష్మీ చేతిలోనే పెట్టేసింది మల్లెమాల మేనేజ్‌మెంట్. దీంతో అనుక్షణం కెమెరా ముందు బిజీ బిజీగా కదులుతోంది రష్మీ గౌతమ్. ఇక పండగ పండగకు స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం, అందులో రష్మీని హైలైట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

రష్మీ తీరు.. ఎప్పుడూ అదే హాట్ టాపిక్
రష్మీ గౌతమ్ ఓ మనసున్న మంచి మనిషి అని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది. సామాజిక స్పృహతో ఆలోచిస్తూ మూగ జీవాలను ప్రేమించడం ఆమె బెస్ట్ క్వాలిటీ. మూగ జీవాల సంరక్షణలో తన వంతు కృషి చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తుండటం రష్మీ నైజం. గత లాక్‌డౌన్ సమయంలో తిండి దొరకక ఆకలితో అలమటించిన మూగజీవాలకు రోడెక్కి అన్నం పెట్టి తన స్వభావాన్ని చాటుకుంది రష్మీ.

నైట్ పార్టీ.. చిల్ అయిన జబర్దస్త్ భామ
అలా వారమంతా బిజీగా గడిపిన యాంకర్ రష్మీ వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసింది. స్నేహితులతో డ్రింక్ పార్టీ చేసుకుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి పెగ్గేస్తూ నైట్ అంతా రచ్చ చేశారని తాజాగా రష్మీ పంచుకున్న ఫొటోస్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఎంజాయ్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

అదృష్టం కలసి రాలే.. అందుకే ఆ ట్రాక్
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పంచుకుంటూ ఉంటుంది రష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ సినిమా చేసి రెచ్చిపోయి గ్లామర్ డోస్ దట్టించినా రష్మీకి అదృష్టం కలసి రాలేదు. దీంతో సినిమాల హవా తగ్గించి బుల్లితెరపైనే హంగామా చేస్తూ తన మార్క్ చూపిస్తోంది రష్మీ గౌతమ్.


Click it and Unblock the Notifications











