యాంకర్ రష్మీపై యాసిడ్ దాడి: చేతబడి ప్రయోగం కూడా.. సంచలనంగా మారిన స్క్రీన్‌షాట్స్

ఇప్పుడు ఉన్న పోటీ వల్ల సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగాలంటే చాలా కష్టమైన పనే అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది రష్మీ గౌతమ్. ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మీపై యాసిడ్ దాడి చేస్తానని, చేతబడి చేయిస్తానని ఓ నెటిజన్ బెదిరింపులకు దిగారు. అసలేం జరిగింది? దానిపై మీరే లుక్కేయండి!

వరుస ఆఫర్లతో రష్మీ దూకుడు

వరుస ఆఫర్లతో రష్మీ దూకుడు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన రష్మీ గౌతమ్.. వరుస షోలలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోను హోస్ట్ చేస్తోంది. వీటిలో తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే, సినిమాల్లోనూ నటిస్తోంది. ఫలితంగా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

వరుస పెట్టి టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ తనదైన శైలిలో పోస్ట్ చేస్తుంది.

కుక్కల గురించి రష్మీ టార్గెట్

కుక్కల గురించి రష్మీ టార్గెట్

కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో గాయపడి ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మీ గౌతమ్‌పై విమర్శలు చేస్తోన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాకు నేరుగా మెసేజ్‌లు చేస్తున్నారు. వీటికి ఈ స్టార్ యాంకర్ ఘాటుగా సమాధానాలు చెబుతూ వివాదాల్లో చిక్కుకుంటోంది.

రష్మీ గౌతమ్‌ పెళ్లి, వయసుపై

రష్మీ గౌతమ్‌ పెళ్లి, వయసుపై

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్క్రీన్ షాట్ షేర్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెకు 2022 జూన్ 28వ తేదీన ఓ మెసేజ్ చేశారు. అందులో 'రష్మీ నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకో. నీకు ఇప్పుడు నలభై ఏళ్లు ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా పెళ్లి చేసుకో' అంటూ పేర్కొన్నారు.

నీ మీద చేతబడి చేయిస్తాను

నీ మీద చేతబడి చేయిస్తాను


గతంలో వయసు పెరిగిపోతుందని, వీలైనంత త్వరగా వివాహం చేసుకోమని సూచిస్తూ పర్సనల్‌గా మెసేజ్ చేసిన నెటిజన్ ఇప్పుడు అదే అకౌంట్ నుంచి యాంకర్ రష్మీ గౌతమ్‌ను బెదిరిస్తూ మరో సందేశాన్ని పంపించారు. అందులో 'నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టిదానా. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లోనే ఉండు' అంటూ ఆమెను తీవ్రమైన పదజాలంతో బెదిరించారు.

యాసిడ్ పోస్తానని వార్నింగ్

అదే మెసేజ్‌లో యాంకర్ రష్మీ గౌతమ్‌కు సదరు నెటిజన్ 'ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయా? యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకు తెలియదు. అన్నీ మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే మాత్రం కష్టాల్లో పడిపోతావు' అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ బయట పెట్టడంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

కంప్లైంట్ ఇవ్వాలా? వద్దా?

కంప్లైంట్ ఇవ్వాలా? వద్దా?


తనకు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసిన రష్మీ ట్విట్టర్‌లో 'ఈ అకౌంట్ నుంచి కొంత కాలం క్రితం నా పెళ్లి, వయసు గురించి మెసేజ్ చేశారు. ఇప్పుడు నా మీద చేతబడి చేయిస్తానని, యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నేను పోలీస్ కేసు నమోదు చేయించొచ్చా' అని పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు చాలా మద్దతు లభిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X