Rashmi Gautam: అవును తప్పులు చేశాను.. అందుకే అది మానేశా.. ట్రోలింగ్ పై యాంకర్ రష్మీ!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. తనదైన శైలీ హోస్టింగ్‌, డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అలరిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీకి లవ్ ట్రాక్ నడుస్తోందన్న పుకార్లతో ఆమె మరింతగా పాపులర్ అయింది. బుల్లితెరపై సుధీర్-రష్మీ జోడికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. యానిమల్స్ కు సంబంధించి, సామాజిక విషయాలపై స్పందిస్తుంటుంది. ఈ క్రమంలో ట్రోలింగ్ బారిన కూడా పడుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తను అప్పట్లో తప్పు చేశానని ఓ నెటిజన్ కు రిప్లై ఇచ్చింది.

సినిమాల్లోకి ఎంట్రీ..

సినిమాల్లోకి ఎంట్రీ..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు రష్మీ గౌతమ్. అంతలా ఈ ముద్దుగుమ్మ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. అలా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది.

2022 నుంచే..

2022 నుంచే..

2022 నుంచి సినిమాల్లో నటిస్తూ వచ్చింది బ్యూటిఫుల్ అమ్మాయి రష్మి. అయితే అప్పటి నుంచి తెలుగు, తమిళం వంటి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఈ అమ్మడికి. ఇలా సాగుతున్న క్రమంలో రష్మీ గౌతమ్ కి జబర్ధస్త్ యాంకర్‌గా అవకాశం వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.

గుంటూరు టాకీస్ తో..

గుంటూరు టాకీస్ తో..

యాంకర్ గా రాణించడానికంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. అలా రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్రంలో డీజే టిల్లుగాపేరొందిన సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించాడు. అలాగే మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ కూడా కీలక పాత్ర పోషించింది.

గీతా మాధురి భర్తతో..

గీతా మాధురి భర్తతో..

గుంటూరు టాకీస్ సినిమా తర్వాత రష్మీ గౌతమ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో చాలా స్లోగానే సినిమాలు చేస్తూ వస్తోంది. సినిమాలను ఆచితూచి అడుగులేస్తూ సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది యాంకర్ రష్మీ గౌతమ్. ఇందులో భాగంగానే ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు.

ఐస్ క్రీమ్ తో ఎంజాయ్..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉండే యాంకర్ రష్మీ అప్పుడప్పుడు మాట్లాడే మాటలు నెట్టింట్లో చర్చలకు, విమర్శలకు దారి తీస్తుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా రష్మీ ఏం మాట్లాడిన వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఐస్ క్రీమ్ బార్ పిక్ షేర్ చేస్తూ "నేను డైరీ ప్రోడక్ట్స్ (పాల ఉత్పత్తులు)ను ప్రమోట్ చేయడం ఆపేశాను. కానీ నేను నా ఐస్ క్రీమ్ ను ఎంజాయ్ చేస్తున్నాను" అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజన్ స్పందించాడు.

డబ్బుల కోసం ఏమైనా..

2019లో రష్మీ ఒక ఐస్ క్రీమ్ షాప్ ను ప్రారంభించిన వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫొటోను రిప్లైగా పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారభించారు. "ఈ సెలబ్రిటీలు అంతే డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. మళ్లీ బయటకొచ్చి ఇలా పోస్ట్ లు పెడతారు" అని కామెంట్స్ చేశారు. ఇలా వివిధ రకాలుగా వచ్చిన కామెంట్స్ పై యాంకర్ రష్మీ స్పందించింది. ఆ ఫొటో ట్యాగ్ చేసిన నెటిజన్ కు రిప్లైగా వివరణ ఇచ్చింది.

అనారోగ్యానికి గురి కావడం..

అనారోగ్యానికి గురి కావడం..

"అవును నేను గతంలో అవగాహన లేకుండా కొన్ని తప్పులు చేశాను. కానీ నేను కొన్నేళ్ల నుంచి పాలను తాగడం మానేశాను. వాటి వాడకం వల్ల నా స్కిన్ అనారోగ్యానికి గురి కావడం నేను గమనించాను. అయితే ఇప్పుడు పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలలో వాటి తయారీ విధానం తెలిసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశాను" అంటూ రాసుకొచ్చింది ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ. మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతున్న ఈ బ్యూటీ వీగన్ గా మారింది. అంటే మాంసం, పాలు, పాల పదర్థాలు రష్మీ తినదు. అందుకే వాటిని ప్రమోట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X