Jabardasth Rashmi Gautam: జబర్దస్త్‌కి రష్మి గౌతమ్ షాక్... ఎవరూ ఊహించి ఉండరుగా!
జబర్దస్త్ యాంకర్ రష్మి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. జబర్దస్త్ ప్రోగ్రాం యాంకర్ గా రష్మి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భోళాశంకర్ సినిమా, కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్ తెలుగు వెర్షన్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పేందుకు సిద్ధం అయినట్టు టాలీవుడ్ బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే....
ముందు నటిగా కొన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది రష్మి గౌతమ్. కానీ యాంకర్ గా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా మళ్ళీ మెరిసి ప్రేక్షకులను అలరించింది. గుంటూరు టాకీస్ సినిమాలో అందాలను ఆరబోసి ప్రేక్షకులను టెంప్ట్ చేసి తర్వాత పలు సినిమాల్లో నటించినా ఎందుకో నటిగా నిలదొక్కుకోలేక పోయింది. ఇక ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. అందాలు ఆరబోత ఎక్కువైందంటూ.. పలువురు కామెంట్స్ కూడా చేశారు.

ఒక పక్క జబర్దస్త్ షో.. ఇక మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో కనిపిస్తూ... ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తోన్న రష్మి గౌతమ్ మరోపక్క వెండితెరపై కూడా మెరిసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించి రచ్చచేసిన విషయం తెలిసిందే. చిరుతో కలిసి భోళా మేనియా అంటూ సాంగ్ లో స్టెప్పులు కూడా వేసి అలరించింది. ఇక ఈ పాటకు ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తరువాత కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్ తెలుగు వెర్షన్ లో రష్మీ ఓ కీలక పాత్రలో కనిపించింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో రష్మి, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ ను యాడ్ చేసి రీషూట్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే యాంకర్ అనసూయ తప్పుకున్నప్పటి నుంచి జబర్దస్త్ లో రష్మీ యాంకరింగ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రష్మీ ప్లేస్ లో యాంకర్ సౌమ్య ప్రోగ్రామ్ చేస్తోంది.

అయితే మల్లెమాల సంస్థ రష్మికి చాలా తక్కువ పారితోషికం ఇస్తోందని, ఈ మధ్యకాలంలో వచ్చిన సౌమ్యకి రష్మి కన్నా చాలా ఎక్కువ పారితోషికం ఇవ్వడంతో రష్మీ కాస్త ఫీల్ అయిందని ప్రచారం మొదలైంది. ఈ విషయంలో బాధ పడ్డ రష్మీ జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. అగ్రిమెంట్ కూడా పూర్తి కావడంతో రష్మి ఈ షో నుంచి తప్పకుంటున్నట్లు అందరికీ చెప్పింది అని అంటున్నారు.

ఇందులో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే జబర్దస్త్ మానేసి పూర్తిగా సినిమాలు వైపు వచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక అనసూయ బాటలోనే రష్మి కూడా వెళ్లనుందనే ప్రచారం సాగుతోంది. చూడాలి మరి.. కొన్నిరోజులు ఆగితే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











