యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం: ప్రేమించే వ్యక్తి దూరం.. బరువెక్కిన హృదయంతో!

రష్మీ గౌతమ్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ చిన్నది తనదైన హోస్టింగ్, యాక్టింగ్, గ్లామర్ ట్రీట్‌తో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోంది. అలాగే, సినిమాల్లోనూ భాగం అవుతూ ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. దీంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. ఆమె ఎంతగానో ప్రేమించే వ్యక్తిని శాశ్వతంగా కోల్పోయింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వరుస షోలతో దూసుకుపోతోన్న రష్మీ

వరుస షోలతో దూసుకుపోతోన్న రష్మీ

సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన రష్మీ గౌతమ్.. వరుస షోలలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోను హోస్ట్ చేస్తోంది. వీటిలో తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తోంది. ఫలితంగా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది.

సినిమాల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ

సినిమాల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ

స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న రష్మీ గౌతమ్.. ఆ మధ్యనే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో వచ్చినా నిరాశే ఎదురైంది. దీంతో హీరోయిన్‌గా కాస్త బ్రేక్ తీసుకోబోతుంది.

యాంకర్ రష్మీ ఇంట్లో పెను విషాదం

యాంకర్ రష్మీ ఇంట్లో పెను విషాదం

తెలుగు స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ఎంతగానో ప్రేమించే గ్రాండ్ మదర్ అనారోగ్య కారణాలతో శుక్రవారం మరణించారు. దీంతో హుటాహుటిన తన ఇంటికి చేరుకున్న ఈ యాంకర్.. ఆమెకు నివాళులు అర్పించారు. ఇక, ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది.

బరువెక్కిన హృదయంతో వీడ్కోలు

బరువెక్కిన హృదయంతో వీడ్కోలు

తాజాగా రష్మీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఈరోజు మా గ్రాండ్‌ మదర్‌ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన హృదయాలతో కుటుంబ సభ్యులమంత ఆమెకు కడసారి విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్‌. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాతోనే ఉంటాయి. ఓం శాంతి' అని పోస్ట్ చేసింది.

రష్మీని ఓదార్చుతోన్న అభిమానులు

రష్మీని ఓదార్చుతోన్న అభిమానులు

తన గ్రాండ్ మదర్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్ యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఆమె అభిమానులు బాసటగా నిలుస్తున్నారు. ఈ మేరకు ఆమెను ఓదార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో రష్మీ గ్రాండ్ మదర్ ప్రవీలా మిశ్రా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటోన్నారు.

ఆ సినిమాలు... షోలతో ఫుల్ బిజీగా

ఆ సినిమాలు... షోలతో ఫుల్ బిజీగా

యాంకర్‌గా సూపర్ సక్సెస్ అయిన రష్మీ గౌతమ్‌కు బుల్లితెరపై ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం రెండు మూడు షోలకే పరిమితం అయిపోయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ 'భోళా శంకర్'తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమాలోనూ కీలక పాత్రలను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X