కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ.. టీఆర్పీ కోసం కాదు నిజంగానే.. కుర్రాడు భలే ఉన్నాడుగా!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో సందడి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగిపోతోన్న బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్. అందం, అభినయం, యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. తద్వారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మీ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇంతకీ అతడు ఎవరు? ఆ పూర్తి వివరాలను మీర చూసేయండి మరి!
ఒక్క షోతో మారిపోయింది:చాలా ఏళ్ల క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఆ లవ్ ట్రాక్‌తో మరింతగా:యాంకర్ రష్మీ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవడానికి ఆమె టాలెంట్ కారణం అయితే.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకోడానికి మాత్రం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలించిందామె. ఫలితంగా ఎంతగానో ఫేమస్ అయిపోతోంది.
షోలు.. సినిమాలతో బిజీ:గతంలో వేగంగా సినిమాలు, షోలు చేసిన రష్మీ గౌతమ్.. కొంత కాలం చాలా స్లో అయింది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. ఇలా 'భోళా శంకర్', 'బాయ్స్ హాస్టల్' వంటి చిత్రాల్లోనూ రష్మీ తళుక్కుమంది.

పెళ్లి పార్టీతో వచ్చిన రష్మీ:చాలా కాలంగా రష్మీ గౌతమ్ ఈటీవీలో ఎన్నో రకాల ఈవెంట్లు, షోలతో సందడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అదే ఛానెల్ ఆమెను ప్రధానంగా పెట్టి 'రష్మీ పెళ్లి పార్టీ' పేరిట ఓ స్పెషల్ ఈవెంట్‌ను తీసుకు వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా దీన్ని డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 9.30 గంటల నుంచి ప్రసారం చేయబోతున్నారు. దీని కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు.
స్పెషల్‌గా.. ఫుల్ ఫన్‌తో:న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారం చేయబోతున్న 'రష్మీ పెళ్లి పార్టీ' ఈవెంట్ ఎన్నో పెర్ఫార్మెన్స్‌లతో సందడిగా సాగినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలను బట్టి అర్థం అవుతోంది. ముఖ్యంగా వీటిలో పలువురు సెలెబ్రిటీలు డ్యాన్స్‌లు, కామెడీ స్కిట్, పాటలు వంటివి చేసి అలరించారు. దీంతో ఈ ఈవెంట్ అంతా ఎంతో స్పెషల్‌గా, ఫన్నీగా సాగిపోయింది.
నిజంగా చెప్పమన్న ఆది:'రష్మీ పెళ్లి పార్టీ' ఈవెంట్‌లో ఎప్పటిలాగే రష్మీకి పెళ్లి అన్నట్లుగా క్రియేట్ చేసి చూపిస్తారు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీనికి కాస్త ట్విస్ట్ ఇచ్చే విధంగా హైపర్ ఆది 'ఇంత కాలం నువ్వు టీవీ రేటింగ్స్ కోసం అన్నీ చేశావు ఓకే. కానీ, ఇప్పుడు నువ్వు ఎవరిని చేసుకోవాలని అనుకుంటున్నావో.. అతడిని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం' అని అడిగేశాడు.
సర్‌ప్రైజ్.. భలే ఉన్నాడే:హైపర్ ఆది అడిగిన వెంటనే రష్మీ గౌతమ్ 'నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి అని ప్రతి అమ్మాయికి ఒక ఆలోచన ఉంటుంది' అని చెబుతుంది. అంతలోనే వెనుక నుంచి ఒక కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. అతడే రష్మీని పెళ్లి చేసుకోబోయే వాడు అని ప్రోమో బట్టి అర్థం అయింది. అయితే, ఎప్పటిలాగే ఇది కూడా టీఆర్పీ స్టంట్‌లో భాగమే అని అంతా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











