ఉల్లిపొర లాంటి చీరలో రష్మీ: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాల సునామీ
తెలుగు బుల్లితెరపై ఇప్పుడున్న పోటీ వల్ల సుదీర్ఘ కాలం పాటు యాంకర్లుగా హవాను చూపించడం అంత సాధ్యం కాదు. కానీ, దీన్ని సుసాధ్యం చేస్తూ ఎన్నో ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది యాంకర్ రష్మీ గౌతమ్. అందానికి అందం, టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. వరుసగా షోలు, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలోనే పెంచుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

సక్సెస్‌ఫుల్‌గా రష్మీ కెరీర్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే రష్మీ గౌతమ్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి జబర్ధస్త్ యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అంతేకాదు, ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంది.

సినిమాల్లో.. నెమ్మదిగానే
బుల్లితెరపై సందడి చేయడం కంటే ముందే వెండితెరపై రచ్చ చేసిన రష్మీ గౌతమ్.. చాలా చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో చాలా నెమ్మదిగానే మూవీలు చేస్తోంది.

ఆ సినిమా కూడా నిరాశే
సరైన ఫలితాలు రాకపోవడంతో పెద్దగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించని రష్మీ గౌతమ్.. గత ఏడాది 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ బుల్లితెరపైనే ఫోకస్ చేస్తోంది.

వరుస షోలు.. ఆ మూవీ
సుడిగాలి సుధీర్, అనసూయ తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలను కూడా హోస్ట్ చేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ జబర్ధస్త్ షోకు గుడ్‌బై చెప్పిన ఆమె 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో మాత్రమే యాంకర్‌గా చేస్తోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా షోలు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా మారింది.

అందులో యాక్టివ్‌గానే
ఏకధాటిగా టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ, సేవా కార్యక్రమాలనూ చేస్తోంది.

హాట్ ఫొటోలతో రచ్చ
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తన క్లీవేజ్‌ను హైలైట్ చేసే పిక్స్ పోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

బ్లాక్ శారీలో రష్మీ షో
తాజాగా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ గౌతమ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ శారీలో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఫోజులిచ్చింది. వీటిలో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ వదిలిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











