మానస్ పై యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్.. మాస్ పిల్లని అంటూ రెచ్చిపోయిన బుల్లితెర బ్యూటీ
జబర్దస్త్ కామెడీ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైగా ఈ షో టెలివిజన్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇక తాజాగా ఈ షోలో భారీ మార్పులు చేశారు. ఇకపై జబర్దస్త్ చాలా కొత్తగా ఉంటుందని, ఎంటర్ టైన్ మెంట్ డబుల్, ఎనర్జీ డబుల్, ఎవ్రీ థింగ్ డబుల్ అంటూ రీసెంట్ గానే ప్రోమో ను విడుదల చేశారు. ఇక ఈ షోతో ప్రతిది డబుల్ ఉంటుందని చెబుతూనే డబుల్ యాంకర్స్ కూడా ఉండబోతున్నారని అనౌన్స్ చేశారు. తాజాగా బుల్లితెర స్టార్ మానస్ ను జబర్దస్త్ కు ఫీమేల్ యాంకర్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ షోకు రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మానస్ ఎంట్రీతో వీరిద్దరి మధ్య తొలిరోజే వాగ్వాదం జరిగింది.
12 ఏళ్లుగా అలరిస్తున్న జబ్దర్దస్త్..
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని దక్కించుకుంది జబర్దస్త్ కామెడీ షో. 2013లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కామెడీ షో ఇప్పటికీ నిర్విరామంగా కొనసాతుండంతో విశేషం. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలు, సెలబ్రెటీలు స్టార్ లుగా మారిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ భరద్వాజ్, హైపర్ ఆది వంటి వారు జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతోపాటుగా వెండితెరపైనా తమ సత్తాచాటుతుండటం విశేషం.

జబర్దస్త్ లో భారీ మార్పులు..
ఎప్పటికప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో మార్పులు చేస్తూనే వస్తున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు క్వాలిటీ కంటెంట్, ప్యూర్ కామెడీని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు మార్పులు, చేర్పులు చేస్తూ సరికొత్తగా ఈ షోను నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ షోకు ఎక్స్ టెండెడ్ గా ఎక్ట్స్రా జబర్దస్త్ షోను నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈషోకు కొత్త దనాన్ని ఇచ్చేందుకు యంగ్ టాలెంటెడ్ యాంకర్లను, ఆర్టిస్టులను ఎంపిక చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇక కంటెంట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం Jabardasth New Chapter Begins అంటూ మరింత జోష్ గా నిర్వహించబోతున్నారు. కాగా జబర్దస్త్ న్యూ ఛాప్టర్ లో యాంకర్ గా రష్మీ గౌతమ్ తో పాటు మానస్ ను కూడా ఎంపిక చేశారు.
మానస్ పై రెచ్చిపోయిన రష్మీ గౌతమ్..
బుల్లితెర స్టార్, సీరియల్ హీరో మానస్ జబర్దస్త్ కామెడీ షోకు ఫీమేల్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మరింత జోష్ ఉంటుందని ప్రామీస్ చేస్తున్నారు. అయితే మానస్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో యాంకర్ రష్మీ అతనిపై మాటల తూటాలు పేల్చింది. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తను పోటీ ఎవ్వరు లేరని, తట్టుకోలేరని, అసలే నేను మాస్ పిల్లని అంటూ మానస్ ను హెచ్చరిస్తుంది. అందుకు మానస్ కూడా ధీటుగా బదులిస్తాడు. నువ్వు మాసైతే నేను ఊరమాస్ అంటూ సమాధానం ఇస్తాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలవ్వడంతో జబర్దస్త్ న్యూ ఛాప్టర్ తొలి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జబర్దస్త్ న్యూ ఛాప్టర్ వివరాలు..
ఇద్దరు యాంకర్లతో పాటు మరిన్ని మార్పులతో షోను మరింత రసవత్తరంగా కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ న్యూ ఛాప్టర్ కు సంబంధించిన తొలి ఎపిసోడ్ జూన్ 21, జూన్ 22న ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఆ తర్వాత ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 9:30 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ షోలో ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవా, తాగుబోతు రమేశ్, నూకరాజు, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, సద్దామ్ హుస్సేన్, ఇమ్మానుయేల్ టీమ్ లీడర్లుగా నవ్వులు పూయించనున్నాను. కృష్ణ భగవాన్, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











