For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth: ప్రియుడి గురించి పెదవి విప్పిన రష్మీ.. ఇప్పుడలా ఉన్నామని పెళ్లిపై కూడా!

  |

  యాంకర్ రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరంలేదు. అంతలా ఈ బ్యూటీ సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూ దూసుకుపోతోంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అలాగే, వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోంది.

  #HBDSudigaliSudheer: Sudigali Sudheer Next Film with Rashmi Gautam | Filmibeat Telugu

  ఇక, చాలా కాలంగా రష్మీ గౌతమ్ బాయ్‌ఫ్రెండ్, పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు గురించి తొలిసారి ఓపెన్ అయింది. అంతేకాదు, పెళ్లి గురించి కూడా పెదవి విప్పింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అప్పుడే ఎంట్రీ.. షోతో పాపులర్

  అప్పుడే ఎంట్రీ.. షోతో పాపులర్

  రష్మీ గౌతమ్ చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలా సినీ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే 'జబర్ధస్త్' అనే షోతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో అదిరిపోయే హోస్టింగ్‌తో ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని అందుకుంది.

  హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

  లవ్ ట్రాక్‌తో మరింతగా ఫేమస్

  లవ్ ట్రాక్‌తో మరింతగా ఫేమస్

  చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు అదిరిపోయే అభినయంతో ఆకట్టుకుంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు లవ్ ట్రాక్ సాగిస్తుందన్న వార్తలతో మరింత ఫేమస్ అయింది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలవడంతో విపరీతంగా హాట్ టాపిక్ అవుతూ ఉంటోంది.

  హీరోయిన్‌గా మాత్రం ఫెయిల్

  హీరోయిన్‌గా మాత్రం ఫెయిల్

  చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గానూ నటించి మెప్పించింది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా సక్సెస్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో లీడ్ రోల్ చేయడానికి ఈమె పెద్దగా ఆసక్తిని చూపించట్లేదు.

  బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

  షోలకు దూరం.. వాటిపై ఫోకస్

  షోలకు దూరం.. వాటిపై ఫోకస్

  రష్మీ గౌతమ్ చాలా కాలం పాటు బుల్లితెరపై ఎన్నో రకాల షోలను నడిపించింది. కానీ, ఈ మధ్య వాటిని బాగా తగ్గించేసింది. ప్రస్తుతం 'జబర్ధస్త్' మినహా మరే షోలోనూ ఆమె చేయడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం నటించడానికి ముందుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి - మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతోన్న 'భోళా శంకర్' సహా పలు చిత్రాల్లో భాగమైంది.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  వరుసగా టీవీ షోలు, సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అవుతోంది.

  బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

  పెళ్లికూతురి గెటప్.. కామెంట్స్

  ప్రస్తుతం రష్మీ గౌతమ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను మాత్రమే చేస్తోంది. ఇందులో వచ్చే శుక్రవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ కోసం ఆమె పెళ్లికూతురిగా నటించింది. ఆమెకు ఆటో రాంప్రసాద్ సోదరుడిగా చేశాడు. మొదట్లో ఈ స్కిట్ ఫన్నీగా సాగినా.. చివరికి వచ్చే సరికి ఇందులో ఎమోషనల్ కంటెంట్ చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  బాయ్‌ఫ్రెండ్ గురించి ఓపెన్

  బాయ్‌ఫ్రెండ్ గురించి ఓపెన్

  ఈ స్కిట్‌లో రష్మీ'మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసు ఇస్తే.. ఈ గుండె చప్పుడు ఆగేంత వరకూ ఈ మనసులో స్థానం వాళ్లకు మాత్రమే. మనకు ఇష్టం ఉన్న వాళ్లు మన పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు' అంటూ ఎమోషనల్ అయింది. తద్వారా సుధీర్ గురించి పరోక్షంగా వెల్లడించింది. అయితే, ఇది టీఆర్పీ కోసం వేసిన స్టంట్ అని కామెంట్స్ వస్తున్నాయి.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Participated in Extra Jabardasth Show. She Opens About her Boyfriend in An Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X