ఇంట్లో ఒంటరిగా రష్మీ గౌతమ్: సుధీర్‌కు ఫోన్ చేసి ఆ మాటలు.. కలకలం రేపుతోన్న వ్యవహారం!

సినిమా రంగంలో అయినా బుల్లితెరపై అయినా ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నా.. చాలా తక్కువ మందికే గుర్తింపు దక్కుతుంది. అయితే, అందులోనూ అరుదుగా కొందరు మాత్రమే జంటలుగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జంట ఒకటి. దాదాపు ఏడేళ్లుగా జంటగా సందడి చేస్తోన్న వీళ్లిద్దరూ ప్రేమ, పెళ్లి అంటూ ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ రష్మీ.. సుడిగాలి సుధీర్‌కు ఫోన్ చేయడం కలకలం రేపుతోంది. దీంతో వీళ్లిద్దరి తీరుపై అనుమానాలు మొదటికి వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

అలా కెరీర్లు మొదలు.. కలుసుకున్నారు

అలా కెరీర్లు మొదలు.. కలుసుకున్నారు

సినిమా నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇక, మ్యాజిక్‌లు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా మారిపోయాడు సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి ఊపుతున్నారు.

లవ్ ట్రాక్ అని వార్తలు రావడానికి కారణం

లవ్ ట్రాక్ అని వార్తలు రావడానికి కారణం

ఆరంభంలో మామూలుగానే ఉన్న రష్మీ సుధీర్.. కొన్నేళ్లకు ప్రేమికులు అన్న ట్యాగ్‌ను అందుకున్నారు. దీనికి కారణం సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్‌ను ఇంప్రెస్ చేసినట్లుగా డైలాగులు చెప్పేవాడు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ మొదలైంది. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు రావడంతో వీళ్లు జంటగా పాపులర్ అయిపోయారు.

 వాళ్లు మాత్రం పదే పదే అలా చేయించడం

వాళ్లు మాత్రం పదే పదే అలా చేయించడం

ప్రేక్షకుల్లో అయోమయం కలిగించేలా రొమాన్స్ చేసే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని తరచూ చెబుతుంటారు. ఈ వార్తలను ఖండిస్తూనే పలు షోలలో మరింతగా రెచ్చిపోతున్నారు. వీళ్లిద్దరికీ ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ షోల నిర్వహకులు పదే పదే డ్యాన్సులో, పాటలో, రొమాంటిక్ స్కిట్‌లో చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ తికమక పడుతున్నారు.

అందులోనూ మరింతగా రెచ్చిపోతోన్నారు

అందులోనూ మరింతగా రెచ్చిపోతోన్నారు

ఎంతో కాలంగా జబర్ధస్త్‌లో షోలో సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ సినిమాల్లోనూ సోలోగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక, అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఢీ' షోలోనూ ఈ జోడీ తెగ హల్‌చల్ చేస్తోంది. మెంటర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తూ జంటగా ముందుకు సాగుతున్నారు.

సుడిగాలి సుధీర్‌కు ఫోన్ చేసిన యాంకర్

ఎప్పటికప్పుడు తమ మధ్య ఏమీ లేదని చెప్పే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ తరచూ ఏదో రకంగా ప్రేమజంటలాగే కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విధాలుగా తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్త పరచుకున్న ఈ జంట.. నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్.. ఓ షోలో భాగంగా కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు ఫోన్ కాల్ చేయడం కలకలం రేపుతోంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
అలాంటి మాటలతో పెరిగిన అనుమానాలు

అలాంటి మాటలతో పెరిగిన అనుమానాలు

వచ్చే వారం ప్రసారమయ్యే 'ఢీ' షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ.. సుధీర్‌కు ఉత్తుత్తి ఫోన్ కాల్ చేసింది. అప్పుడామె 'ఏం చేస్తున్నావ్? అరే ఇంట్లో ఎవరూ లేరు' అని అంటుంది. దీనికి 'నాకు ఫోన్ చేశావ్.. ఏం అర్థం కావట్లేదు' అని అంటాడు. దీంతో 'వెదవ సోది ఆపి ఇంటికి రా' అంటుంది రష్మీ. అప్పుడు సుధీర్ 'ఎందుకు నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తావ్' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X