నీకు ఆ పిచ్చి ఉందంట కదా? బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను ఘోరంగా అవమానించిన రష్మీ గౌతమ్

వెండితెర నటులతో పాటు సమానంగా బుల్లితెర నటులు కూడా ఫేమస్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే హీరోలు ఏడాదికి ఒకటి , రెండు సినిమాలలో మాత్రమే కనిపించి అభిమానులను అలరిస్తుంటారు. కాని బుల్లితెర నటులు అలా కాదు.. వారానికి ఒకసారి దర్శనం ఇస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు.

ఇటీవల కాలంలో టెలివిజన్‌ల్లో ప్రసారం అయ్యే షోలు మంచి రేటింగ్స్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బిగ్‌బాస్‌కు సంబంధించిన కంటెస్టెంట్‌‌లను గెస్ట్‌లుగా ఆహ్వానించారు. ఆ వివరాల్లోకి వెళ్తే...

Anchor rashmi Gautam satires on bigg boss contestant Sravanti Chokkarapu and Jessi in Sridevi Drama Company Show

ఆ షోలతో ఫుల్ ఫాపులర్: ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోల ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీకి పరిచియం అయి.. సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా పరిచియం అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, షకలక శంకర్ వంటి వారు బుల్లితెర మీద కనిపిస్తూనే సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నారు.

Anchor rashmi Gautam satires on bigg boss contestant Sravanti Chokkarapu and Jessi in Sridevi Drama Company Show

శ్రీదేవి డ్రామా కంపెనీలో వారికే ఛాన్స్: జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు హిట్ కావడంతో... దాని మాతృ సంస్థ అయిన మల్లెమాల ప్రొడక్షన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఛాన్సుల కోసం ఎదురు చూస్తోన్న నటీనటులకు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా జనపద కళకారులకు ఈ షో ఊతం ఇచ్చిందనే చెప్పాలి. కండెక్టర్ ఝాన్సీ, పల్సర్ బైక్ సాంగ్ రమణ వంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారనే ఫేమస్ అయ్యారు.

Anchor rashmi Gautam satires on bigg boss contestant Sravanti Chokkarapu and Jessi in Sridevi Drama Company Show

షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. అలాంటి ప్రశ్నలు అడిగిన రష్మీ: తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గెస్టులు వచ్చారు. జెస్సీ, మెహబూబ్, యాంకర్ స్రవంతి మొదలగువారు ఈ షోకు హాజరవడం జరిగింది. వీరిని పాయింట్ బ్లాక్ పెట్టి ప్రశ్నలు అడిగింది యాంకర్ రష్మీ. ఓపెన్ హార్ట్ విత్ రష్మీ అంటూ.. వారిని ఎన్‌కౌంటర్ చేసే ప్రశ్నలు అడగడం జరిగింది.

Anchor rashmi Gautam satires on bigg boss contestant Sravanti Chokkarapu and Jessi in Sridevi Drama Company Show

జెస్సీని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి: ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ ప్రశ్నలు వేస్తూ స్రవంతి అనేగానే.. డబుల్ మీనింగ్ డైలాగులు, చులకనగా మాట్లాడతారు ఎందుకని యాంకర్ స్రవంతిని ప్రశ్నించింది రష్మీ. ఇక మీకు బాగా అమ్మాయిల పిచ్చి ఉందనే అర్థం వచ్చేలా బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీని రష్మీ ప్రశ్నించడంతో షోలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారి షాక్‌కు గురైయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X