పడుకుంటేనే టాప్ పొజిషన్ అంటూ రష్మీ పోస్ట్: ఆ హీరోయిన్ ఫొటో షేర్ చేసి.. చాలా మంది అలాగేనంటూ!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై కనిపించే యాంకర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. నటిగా పరిచయమైన ఈ అమ్మడు.. యాంకర్‌గా మారి ప్రేక్షకులకు మజాను పంచుతోంది.

తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్.. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి చేసి పోస్ట్ సంచలనం అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

అలా వచ్చి.. భారీగా పాపులారిటీ

అలా వచ్చి.. భారీగా పాపులారిటీ

చాలా ఏళ్ల క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్‌లోకి నటిగా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేసింది. అలా సినీ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే 'జబర్ధస్త్' అనే షోతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో అదిరిపోయే హోస్టింగ్‌తో ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

సుధీర్ లవ్‌తో మరింత గుర్తింపు

సుధీర్ లవ్‌తో మరింత గుర్తింపు

అందానికి అందం.. అభినయానికి అభినయం.. హోస్టింగ్‌కు హోస్టింగ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో యమ ఫేమస్ అయింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు లవ్ ట్రాక్ సాగిస్తుందన్న వార్తలతో మరింత క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అయ్యేది. ఫలితంగా నిత్యం హాట్ టాపిక్ అవుతుండేది.

హీరోయిన్‌గా మాత్రం నిరాశనే

హీరోయిన్‌గా మాత్రం నిరాశనే

ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో లీడ్ రోల్ చేయడానికి ఈమె పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

షోలకు దూరంగా.. చిరు చాన్స్

షోలకు దూరంగా.. చిరు చాన్స్

చాలా కాలం పాటు రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎన్నో రకాల షోలలో భాగం అయింది. కానీ, ఈ మధ్య వాటిని పూర్తిగా తగ్గించింది. ప్రస్తుతం 'జబర్ధస్త్' మినహా మరే షోలోనూ ఆమె చేయడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం నటించడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి - మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో రష్మీ నటిస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది.

ఐశ్వర్యరాయ్ ఫొటో షేర్ చేసి

ఐశ్వర్యరాయ్ ఫొటో షేర్ చేసి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ రష్మీ గౌతమ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మీమ్‌ను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో అందాల తార ఐశ్వర్యరాయ్ ఫొటో ఉండడంతో పాటు కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు ఉండడంతో ఇది కాస్తా వైరల్ అయింది. ఇదే పోస్టులో రష్మీ గౌతమ్ కాస్టింగ్ కౌచ్ మీద తన అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకుంది.

Recommended Video

#kajalaggarwal : Kajal Aggarwal Reveals How Gautam Kitchlu Proposed To Her For Marriage
పడుకుంటేనే టాప్ పొజిషన్

పడుకుంటేనే టాప్ పొజిషన్

రష్మీ షేర్ చేసిన మీమ్‌లో 'టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుని ఉంటుంది అని అన్నప్పుడు ఇలా రియాక్ట్ అవుతారు' అంటూ ఐశ్వర్యరాయ్ రియాక్షన్‌ను పెట్టారు. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకున్న రష్మీ గౌతమ్ 'చాలా మంది చాలా ఈజీగా చేసే స్టేట్‌మెంట్ ఇదే' అంటూ అభిప్రాయపడింది. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X