అలా మాట్లాడితే చెప్పు తెగుద్ది.. కమెడియన్ పై యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ దక్కించుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మీ గౌతమ్. తన యాంకరింగ్ స్కిల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. నటిగా 20 ఏళ్ల కిందనే కెరీయర్ ను ప్రారంభించినా ప్రారంభంలో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. 'జబర్దస్త్' ద్వారా మాత్రం యాంకర్ గా విశేష స్పందనను సొంతం చేసుకుంది. యాంకర్ గా తనదైన శైలిని చూపిస్తూ ఆడియెన్స్ ను మెప్పించింది. తక్కువ సమయంలోనే యాంకర్ గా మంచి క్రేజ్ దక్కించు కుంది. స్టార్ స్టేటస్ సొంతం చేసుకొని టెలివిజన్ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక రష్మీ గౌతమ్ ప్రస్తుతం 'జబర్దస్' కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. మరోవైపు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ మెరుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ షోలతో అదరగొడుతోంది. తన దైన శైలిని ప్రదర్శిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో ఎప్పటికి అప్పుడు పంచుకుంటూ ఉంటుంది. లేటెస్ట్ లుక్స్ తోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను మరింతగా ఆకర్షిస్తుంటుంది.

Anchor Rashmi Gautam Serious Warning to Comedian

రష్మీ గౌతమ్ ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి క్వాలిటీస్ తోనే ఆమెకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. అయితే తనపై ఎవరూ ఎలాంటి కామెంట్లు వేసినా వెంటనే తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చి వారి నోరు మూయిస్తుంది. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర కమెడియన్, జబర్దస్త్ నటుడు కెవ్వు కార్తీక్ కు దిమ్మ తిరిగి పోయే కౌంటర్ ఇచ్చింది. కెవ్వు కార్తీక్ అన్న మాటలకు షాకింగ్ గా రిప్లై ఇచ్చింది. రష్మీ గౌతమ్ మాటలకు అంతా నివ్వెర పోయారు.

తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ లోని ఇంట్రెస్టింగ్ అంశాలను చూపించారు. రాం ప్రసాద్, ప్రవీణ్, సద్దాం హుస్సేన్ వంటి ప్రముఖ కమెడియన్లు వారి తాజా స్కిట్లతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్ పై కెవ్వు కార్తీక్ ఫన్నీ కామెంట్లు వేశాడు. వృద్ధురాలి గెటప్ వేదికపై నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ కూడా ముసలిదేనని, పెళ్లి కాకుండానే ఉండిపోతుందంటూ డైలాగ్ చెబుతాడు.

దీంతో రష్మీ గౌతమ్ అతనిపై సీరియస్ అవుతుంది. అలా మాట్లాడితే చె..ప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇస్తూ దీంతో వెంటనే కమెడియన్ కెవ్వు కార్తీక్ తన మాట మార్చుకుంటాడు. ఇక రష్మీ గౌతమ్ రీసెంట్ గానే తన 37వ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది. ఇటు టీవీ షోల్లో సందడి చేస్తూనే అటు సినిమా అవకాశాలను కూడా అందుకుంటోంది. 'గుంటూరు కారం', 'నెక్స్ నువ్వే', 'అంతం', 'అంతకు మించి' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X