విషాదంలో యాంకర్ రష్మీ గౌతమ్.. మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ వీడియో

Anchor Rashmi: యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బుల్లితెరపై మకుటం లేని రాణిలో వెలిగిపోతుంది. టీవీ ఆన్ చేస్తే చాలు ఏదొక షోలో కనిపిస్తునే ఉంటుంది. ఆమె హవా అంతా ఇంతా.. కాదు. ఆమె యాంకరింగ్ చేస్తే షోలు టాప్ రేటింగ్ లో ఉంటున్నాయంట. తన అందం, అభినయంతో పాటు ముద్దు ముద్దు ఇంగ్లీష్ మిక్స్ డ్ తెలుగు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలా తనకంటూ.. ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఓ వైపు పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ మెరుస్తోందీ. వెండి తెరపై కూడా గ్లామర్ షో చేస్తుంది. రెచ్చిపోయి నటించిన ఈ అమ్మడికి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. సరే అనుకున్న హాట్ బ్యూటీ.. ప్రస్తుతం టీవీ షోలపై పుల్ ఫోకస్ పెట్టింది.

ఇదిలా ఉంటే.. తాజాగా యాంకర్ రష్మీ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గత వారం ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఆమె తాత గారు చనిపోయారు. అంతకు ముందు గత ఏడాది తన గ్రాండ్ పేరెంట్ నాని కూడా కాలం చేసిన విషయం తెలిసిందే.. వారు లేని లోటును గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవతుంది. తాను ఎంతగానో ప్రేమించే తాత, నాని ఇద్దరూ ఇప్పడు తనకు దూరమయ్యారనీ, వారు ఇప్పుడు స్వర్గంలో కలుసుకుని ఉంటారంటూ రష్మీ భావోద్వేగానికి లోనైంది. తనను ఎంతో ఇష్టంగా చూసుకునే తాత లేని లోటు గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరు అయింది. వారం క్రితం కూడా ఆమె వారిద్దరి ఫోటోలను తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం అందరికి తెలిసిందే.

Anchor Rashmi Gautam Shares An Emotional Post About Her Grandfather Death

తాజాగా రష్మీ మరోసారి సోషల్ మీడియాలో తన తాతను గుర్తు చేసుకుంటూ.. మాకే కాదు. ఈ మూగజీవీ కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతుంది. మా తాత నాకు చేసిన ఎన్నో ఇచ్చారు. ప్రతి దానికి థాంక్స్ తాత.. ఇక మీరిద్దరూ సర్వంలో కలుసుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం. మీతో గడిపిన ప్రతీ క్షణాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నా ప్రయాణంలో ఒక శకం ముగిసినట్టుగా అనిపిస్తోంది తాత అంటూ ఎమోషనల్ అయింది.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. రష్మీ గౌతమ్.. ఎన్నో సినిమాల్లో నటించి.. అయినప్పటికీ ఆమెకు జబర్దస్త్ షో వల్లే పుల్ క్రేజ్ వచ్చింది. కొన్ని షో పేర్ల కంటే.. ఆమె పేరుతోనే రష్మిక షో అనేలా పాపులరిటీ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి కూడా సినిమాల్లో బాగానే ఆఫర్లు వస్తున్నా సరైనా గుర్తింపు రావడం లేదు. వాస్తవానికి రష్మీ తొలుత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో కమిడియన్ సునీల్‌కు ప్రియురాలిగా నటించిన ఆమె కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో నటించింది ఈ బుల్లి తెర యువరాణి రష్మీ గౌతమ్.

More from Filmibeat

Read more about: rashmi gautam emotional post
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X