For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుధీర్‌తో పెళ్లిపై రష్మీ షాకింగ్ కామెంట్స్: చాలా సార్లు నాకోసం ట్రై చేశాడని బాంబ్ పేల్చిన యాంకర్

    By Manoj
    |

    రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లు తెలియని వారు ఉండరు అని చెప్పొచ్చు. అంతలా వీళ్లిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కొక్కరిగా కంటే జంటగా ఫేమస్ అయిన వీళ్లు.. ప్రేమాయణం సాగిస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎన్నిసార్లు ఖండించినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, తన కోసం చాలా సార్లు ట్రై చేశాడని బాంబ్ పేల్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

    రష్మీ గౌతమ్ అలా.. సుడిగాలి సుధీర్ ఇలా

    రష్మీ గౌతమ్ అలా.. సుడిగాలి సుధీర్ ఇలా

    తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతోంది రష్మీ గౌతమ్. గ్లామర్‌తో ఆకట్టుకుంటూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సినిమా ఛాన్స్‌లూ పట్టేస్తోంది. ఇక, సుడిగాలి సుధీర్ కూడా బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. జబర్ధస్త్‌లో టాప్ కమెడియన్‌గా ఉన్న అతడు... సినిమా హీరోగానూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నాడు.

    ఇద్దరూ కలిశారు... ఫేమస్ అయిపోయారు

    ఇద్దరూ కలిశారు... ఫేమస్ అయిపోయారు

    జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా కలిశారు రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్. ఆ షోలో యాంకర్‌గా ఆమె.. టీమ్ లీడర్‌గా అతడు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ జంట విపరీతమైన రీతిలో ఫేమస్ అయింది.

     ఛానెళ్ల నుంచి టీమ్ లీడర్ల వరకు వదల్లేదు

    ఛానెళ్ల నుంచి టీమ్ లీడర్ల వరకు వదల్లేదు

    చాలా కాలంగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌. ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు చాలా టీవీ ఛానెళ్లు ప్రయత్నాలు చేశాయి. అలాగే, కొన్ని షోలలో వీళ్లతో ప్రత్యేకమైన రొమాంటిక్ యాక్ట్‌లు చేయించారు. అలాగే, కొందరు టీమ్ లీడర్లు రష్మీ సుధీర్‌పై స్కిట్లు రాస్తూ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు.

     క్రేజీ జంటకు వివాహం చేసిన జబర్ధస్త్ టీమ్

    క్రేజీ జంటకు వివాహం చేసిన జబర్ధస్త్ టీమ్

    కొద్ది రోజుల క్రితం ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో యాంకర్ రష్మీకి, సుడిగాలి సుధీర్‌కు పెళ్లి చేసింది సరదా సత్తిపండు అదుర్స్ ఆనంద్ టీమ్. పెళ్లి అంటే నిజంగా కాదు... స్కిట్‌లో భాగంగానే. ఇందులో ఆనంద్... సుధీర్‌లా, వినోదిని.. రష్మీలా గెటప్ వేసుకుని యాక్టింగ్ చేశారు. గతంలో వాళ్లిద్దరూ చేసిన రొమాంటిక్ డ్యాన్స్‌ను వీళ్లిద్దరూ చేశారు. ఆ తర్వాత ఈ జోడీకి పెళ్లి చేశారు.

    రాసింది కాకుండా.... రియల్‌గా చేయడంతో

    రాసింది కాకుండా.... రియల్‌గా చేయడంతో

    ఆ స్కిట్‌లో భాగంగా నిజంగానే రష్మీ సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో సుధీర్‌ను ‘నీకు ఇంటి పనులు చేయడం వచ్చా.? మా అమ్మ కూడా గయ్యాలిలా ఉంటే నీకు ఓకేనా' అని అడిగింది. దీనికి ‘నీలాంటి మంచి అమ్మాయి కోసం ఏదైనా భరిస్తా' అంటూ బదులిచ్చాడు సుధీర్. దీంతో ఆనంద్ ఎంటరై ‘నేను రాసింది చేయకుండా నిజంగా లవ్ ట్రాక్ నడుపుతున్నారేంటి' అని అంటాడు.

    సుధీర్‌తో పెళ్లిపై యాంకర్ షాకింగ్ కామెంట్స్

    సుధీర్‌తో పెళ్లి గురించి రష్మీ... రష్మీతో వివాహంపై సుధీర్‌కు తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఈ జంట చెబుతూ వస్తోంది. కానీ స్కిట్లలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారీ ఇద్దరు. తాజాగా సరదా సత్తిపండు అదుర్స్ ఆనంద్ టీమ్‌ స్కిట్‌ ద్వారా తమ బంధాన్ని మరోసారి లీక్ చేసుకున్నారు రష్మీ సుధీర్.

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    చాలా సార్లు ట్రై చేశాడని బాంబ్ పేల్చిన బ్యూటీ

    చాలా సార్లు ట్రై చేశాడని బాంబ్ పేల్చిన బ్యూటీ

    స్కిట్‌లో భాగంగా ‘యాంకర్ రష్మీ గౌతమ్‌ను పెళ్లి చేసుకుందామనుకున్నా.. ఈ గారడీ రష్మీని ఇచ్చి పెళ్లి చేశావేంట్రా' అని సుధీర్ డైలాగ్ చెబుతాడు. ఆ వెంటనే అందుకున్న రష్మీ ‘పర్లేదులే సుధీర్.. ఎన్నెన్నో అనుకుంటాము. అన్నీ జరుగుతాయా ఏంటి.? నన్ను పెళ్లి చేసుకుందామని ఎన్ని సార్లు ట్రై చేశావ్. ఆఖరికి దీన్ని పెళ్లి చేసుకున్నావా.?' అంటూ చెప్పడంతో అందరూ షాకయ్యారు.

    English summary
    Actress Rashmi Gautam, who is known for anchoring on TV show Jabardasth, has opened up on her wedding and link up with Sudigali Sudheer and said that she would prefer to have a baby first and then marry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X