అక్కడ రష్మీ గౌతమ్‌కు 100 ఎకరాలు ల్యాండ్? సుధీర్‌తోపెళ్లిపై హాట్ కామెంట్స్
గత కొన్నాళ్ల కితం వరకు తెలుగు బుల్లితెర దగ్గర ఫీమేల్ యాంకర్స్ అంటే మంచి టాలెంట్ తో పాటుగా హుందాగా అందంగా కనిపించిన రోజులు గుర్తొస్తాయి. కానీ ఇపుడు మాత్రం అందుకు కొంచెం డిఫరెంట్ గా పరిస్థితులు మారాయి. తెలుగు భాష రాకపోయినా సినిమాల్లో హీరోయిన్స్ గా ఎలా చలామణి అవుతున్నారో ఇదే విధంగా చాలా మంది హీరోయిన్స్ అవుదాం అనుకున్న కొంతమంది నటీమణులు బుల్లితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం స్టార్ట్ చేశారు.
కాగా ఈ లిస్ట్ లో అయితే ఇప్పుడు టాప్ మోస్ట్ లో వినిపించే పేర్లు కొన్నే ఉంటాయని చెప్పాలి. ఆ కొంతమంది లేడీ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. కాగా రష్మీ బుల్లితెర దగ్గర జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా పాపులర్ అని అందరికీ తెలుసు. అలాగే తర్వాత నుంచి ఆమెకి మంచి ఫేమ్ రావడం ఇదే జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యిన సుడిగాలి సుధీర్ తో చేసిన ట్రావెల్ కానీ బుల్లితెరపై వారి జంట కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే.

కాగా తాజాగా ఆమె తనపై ఇంకా తన కో యాంకర్ ప్రదీప్ పై కూడా చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. కాగా వీటిలో రష్మీ సుధీర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తన వల్ల కానీ కానీ ఇద్దరిలో ఎవరి వల్ల ఎవరికీ ఫేమ్ రాలేదని తెలిపింది. అలాగే తనకి సుధీర్ తో పరిచయం జబర్దస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది అని కానీ ప్రదీప్ తో అంతకు ముందు నుంచే పరిచయం ఉందని సో సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా మొదటిగా ప్రదీప్ విషయంలోనే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తా అని తెలిపింది.
అలాగే ప్రదీప్ కి నాకు మంచి బాండింగ్ ఎప్పుడు నుంచో ఉందని అతను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ముద్దు, వార్నింగ్, చెంప దెబ్బ ప్రశ్నకి హైపర్ ఆదికి చెంప దెబ్బ ఇస్తాను, సుధీర్ కి వార్నింగ్, ప్రదీప్ కి ముద్దు పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే వీటితో పాటుగా తనకి 100 ఎకరాల ల్యాండ్ ఉంది అనే పుకార్లపై కూడా రష్మీ హాట్ కామెంట్స్ చేసింది.
నాకు 100 ఎకరాలు అయితే లేవు కానీ తన అమ్మ తరపున ఒరిస్సా సైడ్ కొంచెం ఎక్కువ ఎకరాలే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా తన పెళ్లిపై అలాగే తనకి ఎలాంటి వాడు భర్తగా కావాలి అనే వాటికీ సమాధానం ఇచ్చింది. ఇది మాత్రం ఒకింత ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.. సో ఎలాంటి భర్త రావాలని నేను కోరుకోవడం లేదు అంటూ తన పెళ్లిపై తేల్చేసింది. దీనితో తన విషయంలో కూడా రష్మీ మంచి క్లారిటీగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే రష్మీ తన టెలివిజన్ షోస్ తోనే బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











