Anchor Rashmi: నాకు వాళ్లతో రిలేషన్ ఉంటే ఆధారాలు బయటపెట్టు.. యాంకర్ రష్మీ స్ట్రాంగ్ కౌంటర్
యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రష్మి గౌతమ్ యాంకరింగ్ ను అందరూ ఇష్టపడుతుంటారు. ఆమె సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. రష్మి గౌతమ్ 10 ఏళ్లకు పైగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ అలరిస్తూ వస్తుంది. మరోవైపు సినిమాలోనూ నటిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
రష్మి గౌతమ్ కేవలం యాంకరింగ్, సినిమాలు మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మహిళల హక్కులు, జంతు సంరక్షణ, సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. రష్మి తరచూ సమాజానికి సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగిన తన గొంతును వినిపిస్తారు. అలా ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ చేసింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్ట్ పెడుతున్నారు.

ముఖ్యంగా పాపులర్ టీవీ షోలతో అనుబంధం ఉన్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థతో, అందు వర్క్ చేసే నటులతో ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజునే తనపై అసభ్య వ్యాఖ్యలు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలను గమనించిన రష్మి వెంటనే స్పందిస్తూ సదరు నెటిజన్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తనపై చేసిన ఆరోపణలకు ముందు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది.
రష్మి తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. 'ముందుగా మీ ఆరోపణలకు రుజువులు చూపించు. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నాపై వేధింపులకు ఎవరికీ హక్కు లేదు. నేను నిన్ను, మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు నేను ఎవరితో తిరిగినా అది మీ సమస్య కాదు' అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అలాగే తనపై లింకులు ఉన్నాయని చెబుతున్నవారు ఆ వ్యక్తుల పేర్లు కూడా ప్రూఫ్‌తో చెప్పాలని ఆమె సవాల్ విసిరింది. ఒకరి క్యారెక్టర్‌ను దెబ్బతీయాలంటే ఇద్దరి పేర్లు బయటపెట్టడం న్యాయం అవుతుందని పేర్కొంది.
రష్మి చేసిన ఈ ట్వీట్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ, మహిళలపై ఇలాంటి వ్యక్తిగత దాడులు చేయడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై కూడా చర్చ మొదలైంది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కు రష్మి పలుమార్లు ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందిస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించడం ఆమె స్టైల్‌గా మారింది.
ఇక రష్మి కెరీర్ విషయానికి వస్తే.. సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన రష్మి తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా జబర్థస్త్ కామెడీ షో ద్వారా ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన స్కిట్స్, షోల వల్ల ఈ జోడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా కొనసాగుతోంది. మహిళ దినోత్సవం రోజే యాంకర్ రష్మి వేధింపులకు గురికావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











